News March 24, 2025
KMR: పదో తరగతి పరీక్షలు.. 23 మంది గైర్హాజరు

కామారెడ్డి జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని జిల్లా విద్యాధికారి రాజు పేర్కొన్నారు. సోమవారం ఇంగ్లిష్ పరీక్ష జరగ్గా.. మొత్తం 12,579 విద్యార్థులకు గాను 12,556 మంది పరీక్ష రాయగా, 23 మంది పరీక్షకు హాజరు కాలేదని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించామని తెలిపారు.
Similar News
News September 13, 2025
DSC అభ్యర్థులకు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు

AP: డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 19న సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందజేయనున్నారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం సమీపంలో ఈ కార్యక్రమం జరగనుంది. నిన్న విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఆ ప్రదేశాన్ని పరిశీలించి ఏర్పాట్లపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే.
News September 13, 2025
కాంగోలో పడవ ప్రమాదాలు.. 193 మంది మృతి

కాంగోలో జరిగిన రెండు వేర్వేరు పడవ ప్రమాదాల్లో 193 మంది మరణించారు. ఈక్వేటార్ ప్రావిన్స్‌కు 150 కి.మీ దూరంలో ఈ ప్రమాదాలు జరిగాయి. గురువారం సాయంత్రం 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవలో మంటలు చెలరేగి 107 మంది మృతిచెందారు. 146 మంది గల్లంతు కాగా మిగతావారు సురక్షితంగా బయటపడ్డారు. బుధవారం జరిగిన మరో ప్రమాదంలో మోటార్ పడవ బోల్తా పడి 86 మంది చనిపోయారు.
News September 13, 2025
ALERT.. అతి భారీ వర్షాలు

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో TGలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఇవాళ NML, NZB, కామారెడ్డి, MDK, సంగారెడ్డి జిల్లాల్లో, రేపటి నుంచి ఈ నెల 16 వరకు ADB, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, NZB భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. అటు అల్పపీడన ప్రభావంతో APలోని ఏలూరు, NTR, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని APSDMA అంచనా వేసింది.