News April 3, 2025
KMR: పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్

మద్నూర్‌లో నిషేధిత అల్ఫాజోలం పట్టుబడ్డ కేసులో ఇది వరకే పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఓ పత్రికలో పని చేసే మరో వ్యక్తి పైయ్యర్ల శ్రీనివాస్ పరారీలో ఉండగా బుధవారం పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో నిషేధిత మత్తు పదార్థాలు కలిగి ఉన్న, సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
Similar News
News December 13, 2025
BHPL: ఎన్నికల ఖర్చులు.. లెక్క చెప్పాల్సిందే!

జిల్లాలో 248 గ్రామ పంచాయతీలు, 2,102 వార్డులు ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓడిన గెలిచిన ప్రచారం కోసం పెట్టిన ప్రతి రూపాయి ఖర్చు లెక్క ఎన్నికల కమిషన్‌కు చెప్పాలి. ఏ విడత ఎన్నిక అయినా నామినేషన్ వేసిన రోజు నుంచి పోలింగ్ ముగిసిన రోజు వరకు సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల్లో ప్రతి ఒక్క అభ్యర్థి ఎన్నికల కోసం నిర్వహించిన లావాదేవీలు నమోదు చేయాల్సిందే.
News December 13, 2025
కోనసీమ ‘రాజ’సం.. మన రాజుగారు

కోనసీమ మట్టి పరిమళం, కళాత్మక విలువల మేళవింపు డీవీఎస్ రాజు. అల్లవరం గడ్డపై పుట్టి, భారతీయ చలనచిత్ర రంగాన్ని ప్రభావితం చేసిన ఆ ‘సినీ భీష్ముడి’ జయంతి నేడు. ఆయన తండ్రి డి.బలరామరాజు నరసాపురం ఎంపీగా ప్రజాసేవలో ఉంటే, తనయుడు డీవీఎస్ రాజు కళామతల్లి సేవలో తరించారు. కేవలం నిర్మాతగానే కాకుండా, జాతీయ స్థాయిలో NFDC ఛైర్మన్‌గా తెలుగు వారి కీర్తిని దశదిశలా చాటి దార్శనికుడిగా నిలిచారు.
News December 13, 2025
పొదుగు పెద్దగా ఉంటేనే ఎక్కువ పాలు వస్తాయా?

కొందరు గేదెను కొనుగోలు చేసే ముందు దాని పొదుగును చూస్తారు. పెద్ద పొదుగు ఉంటే అది ఎక్కువ పాలు ఇస్తుందని అనుకుంటారు. పెద్ద పొదుగు ఉన్నంత మాత్రాన అది ఎక్కువ పాలు ఇవ్వదు. పాలు పితికిన తర్వాత పొదుగు గాలి తీసిన బెలూన్‌లా మెత్తగా, ముడతలు పడే గుణం ఉండాలి. అలా కాకుండా పాలు తీశాక కూడా గట్టిగా ఉంటే అది మాంసపు పొదుగుగా గుర్తించాలి. అది ఎక్కువ పాల దిగుబడికి పనికిరాదని భావించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


