News March 5, 2025
KMR: పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు పక్కడ్బందీగా, మాల్ ప్రాక్టీస్‌కు తావివ్వకుండా నిర్వహించాలని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. కామారెడ్డి పట్టణంలోని పలు పరీక్ష కేంద్రాలను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాలలోనికి పంపించే క్రమంలో ప్రతీ విద్యార్థిని తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. అనధికార వ్యక్తులను లోనికి పంపించకూడదని పేర్కొన్నారు.
Similar News
News March 20, 2025
బాపట్ల: కలెక్టర్‌ను కలిసిన R&B ఈఈ

బాపట్ల జిల్లా రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఆర్. రాజా నాయక్ గురువారం బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టర్‌కు మొక్కను అందజేశారు.
News March 20, 2025
ప్యాపిలి: స్కూల్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు

ప్యాపిలి మండలం ఏనుగుమర్రి జడ్పీ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ యం.బొజ్జన్న విద్యార్థినీల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. విధుల నిర్వహణలో తీవ్ర అలసత్వం వహించడమే కాకుండా విద్యార్థుల పట్ల అసభ్యంగా, దురుసుగా ప్రవర్తించినట్లు మండల విద్యాశాఖ అధికారి, డిప్యూటీ విద్యాశాఖ అధికారి తమ నివేదికల్లో వెల్లడించినట్లు చెప్పారు.
News March 20, 2025
రాత్రి 7 గంటలలోపు ఈ పని చేస్తే?

రాత్రి 7 గంటలలోపు భోజనం చేయకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 7 గంటలకు ముందే డిన్నర్ చేస్తే ఆయుర్దాయం 35 శాతం పెరుగుతుందని చెబుతున్నారు. త్వరగా భోజనం చేస్తే జీర్ణం కావడానికి, శరీరం విశ్రాంతి తీసుకోవడానికి తగినంత సమయం దొరుకుతుంది. డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. బరువు తగ్గే అవకాశం ఉంది. గుండె జబ్బులు వచ్చే ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది.