News March 21, 2025
KMR: పరీక్ష కేంద్రాల వద్ద BNS 163 సెక్షన్ అమలు: SP

కామారెడ్డి జిల్లాలో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద BNS సెక్షన్ 163(144 సెక్షన్) అమలులో ఉంటుందని జిల్లా SP రాజేష్ చంద్ర గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ దుకాణాలను మూసివేసి ఉంచాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల 200 మీటర్ల వరకు గుంపులుగా ఉండరాదన్నారు. అత్యవసర సమయంలో డయల్ 100ను వినియోగించుకోవాలని సూచించారు.
Similar News
News November 22, 2025
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు అబ్జర్వర్గా నవీన్ కుమార్

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జడ్పీహెచ్ఎస్ పంతంగిలో జరగబోయే అండర్ – 17 బాలబాలికల రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలను పర్యవేక్షించడానికి జడ్.పి.హెచ్.ఎస్ భూషణరావుపేట ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ వీ. నవీన్ కుమార్ను రాష్ట్ర ఎస్ జీ ఎఫ్ క్రీడల అధికారిని ఉషా రాణి నియమించారు. ఈ ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, కోరుట్ల స్పోర్ట్స్ క్లబ్ వారు అభినందించారు.
News November 22, 2025
కామారెడ్డి: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలకు దరఖాస్తులు

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు ఎగ్జామినేషన్లో డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO రాజు తెలిపారు. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్లో పరీక్ష ఫీజు ₹100, హయ్యర్ గ్రేడ్ పరీక్ష ఫీజు ₹150, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్లో ₹150, హయ్యర్ గ్రేడ్లో ₹200 చెల్లించాలని చెప్పారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన సర్టిఫికెట్లు DEC 20లోపు DEO ఆఫీసులో సమర్పించాలని పేర్కొన్నారు.
News November 22, 2025
సత్యసాయి బాబా శత జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించండి: కలెక్టర్

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతోత్సవాలను జిల్లా వ్యాప్తంగా వైభవంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేయాలని అధికారులను కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశించారు. ఈ ఏడాది సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా ప్రతీ మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కలెక్టర్ నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.


