News March 21, 2025
KMR: పిడుగు పాటుతో గేదెలు, గొర్రెలు మృతి

అల్పపీడన ద్రోణి ప్రభావంతో కామారెడ్డి జిల్లాలో శుక్రవారం అకాల వర్షం కురిసింది. బిక్కనూరు, రాజంపేట, సదాశివనగర్, లింగంపేట తదితర మండలాల్లో అకాల వర్షం పడింది. లింగంపేట మండలం లింగంపల్లి శివారులో పిడుగు పడింది. పిడుగు పాటుకు 2 బర్రెలు మృతి చెందాయి. లింగంపేట మండలం పోతాయిపల్లి గ్రామ శివారులో పిడుగు పడి మూడు గొర్రెలు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు.
Similar News
News July 8, 2025
యాప్స్‌లో మోసం.. నాలుగింతలు వసూలు!

రైడ్ పూలింగ్ యాప్స్‌ల దోపిడీపై ఓ మహిళ చేసిన ట్వీట్ వైరలవుతోంది. బెంగళూరుకు చెందిన మహిళ 2.6kms వెళ్లేందుకు ఆటో బుక్ చేయగా రూ.172.45 చూపించింది. అదే దూరానికి డైరెక్ట్‌గా ఆటోలో వెళ్తే రూ.39 ఛార్జీని తీసుకున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. దీంతో యాప్స్‌లో జరుగుతున్న మోసాలపై చర్చ మొదలైంది. Ola, Rapido, Uber వంటి యాప్స్‌లో స్కామ్స్ జరుగుతున్నాయని, తామూ ఈ వ్యత్యాసాన్ని గమనించినట్లు పలువురు చెబుతున్నారు.
News July 8, 2025
కామవరపుకోట: బస్సు ఢీకొని ఒకరు మృతి

కామవరపుకోట మండలం తడికలపూడి శ్రీనివాస వేబ్రిడ్జి వద్ద మంగళవారం జరిగిన యాక్సిడెంలో ఒకరు మృతి చెందారు. ఓ ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
News July 8, 2025
భూపాలపల్లి: జిల్లా వ్యాప్తంగా 35.6 మి.మీ వర్షపాతం

గడిచిన 24 గంటలలో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 35.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మండలాల వారిగా చూస్తే మహాదేవపూర్ 3.8 మి.మీ, పలిమెల 3.0 మి.మీ, మహముత్తారం 10.4 మి.మీ, కాటారం 3.8 మి.మీ, మల్హర్ 8.6 మి.మీ రేగొండ 2.6 మి.మీ, భూపాలపల్లి 3.4 మి.మీగా నమోదైంది.