News March 7, 2025
KMR: పెళ్లిలో గొడవ.. వ్యక్తి మృతి

పెళ్లిలో గొడవ జరిగి వ్యక్తి మృతి చెందిన ఘటన మహమ్మద్ నగర్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శివకుమార్ వివరాలు.. ఎల్లారెడ్డికి చెందిన రాములు(42) ముగ్దంపూర్ గ్రామంలో బంధువుల ఇంటికి పెళ్ళికి వెళ్లాడు. పెళ్లి కూతురును తీసుకురావడానికి పంపకపోవడంతో గొడవ జరిగింది. మద్యం తాగి ఉన్న రాములు స్పృహ కోల్పోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 20, 2025
బోర్డులను “బ్రోకర్ల డెన్”లుగా మార్చారు: సంజయ్

కేరళ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శబరిమల భక్తులకు ప్రభుత్వం, దేవస్వం బోర్డు చేసిన ఏర్పాట్లు పేలవంగా ఉన్నాయని విమర్శించారు. ఇటీవల AP భక్తులతో కేరళ పోలీసు అధికారి <<18328677>>అసభ్యకరంగా ప్రవర్తించడం<<>>పై మండిపడ్డారు. దేవస్వం బోర్డులను కమ్యూనిస్టులు “బ్రోకర్ల డెన్”లుగా మార్చి, ఆలయాలను ATM కేంద్రాలుగా చూస్తున్నారన్నారు. ప్రతి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోందని ఫైరయ్యారు.
News November 20, 2025
రేగళ్లపాడు సెక్రటరీని సస్పెండ్ చేసిన కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి శివమాధవరావు సస్పెండయ్యారు. సత్తుపల్లి(M) రేగళ్లపాడులో లబ్ధిదారులు ఎడుకొండలు, సీతకు బిల్లులు చెల్లించేందుకు కార్యదర్శి ఈ నెల 4న రూ. 10 వేలు డిమాండ్ చేశారు. బాధితులు టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయగా, హౌసింగ్ ఈఈ శ్రీనివాస్ విచారణ చేపట్టారు. ఈఈ నివేదిక ఆధారంగా కలెక్టర్ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News November 20, 2025
అనకాపల్లి: ‘ఈనెలాఖరులోగా పది సిలబస్ పూర్తి చేయాలి’

ఈ నెలాఖరులోపు పదవ తరగతి విద్యార్థులకు సిలబస్ పూర్తి చేయాలని డీఈవో అప్పారావు నాయుడు ఆదేశించారు. శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు వందరోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయాలన్నారు. వచ్చే నెల6 నుంచి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ప్రతిరోజు సాయంత్రం చదివిన సబ్జెక్టుపై పరీక్షలు జరపాలన్నారు. ఫిబ్రవరి 9 నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు, మార్చి 2 నుంచి గ్రాండ్ టెస్ట్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు.


