News January 24, 2025
KMR: పేదలకు లబ్ధి చేకూర్చాలి: కలెక్టర్

పేదలకు లబ్ధి చేకూర్చాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 36వ వార్డులో ప్రజాపాలన వార్డు సభలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. వార్డు సభలో ముసాయిదా జాబితాను చదవడం జరుగుతుందని, వాటిలో అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలన్నారు. జాబితాలో పేరు రానివారు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు స్వీకరించడం నిరంతర ప్రక్రియ అని ఆయన వెల్లడించారు.
Similar News
News December 4, 2025
నేడు, రేపు భారత్లో పుతిన్ పర్యటన

రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండ్రోజుల పర్యటనకు నేడు భారత్ రానున్నారు. రాత్రి 7గంటలకు ఢిల్లీ చేరుకొని PM మోదీ ఇచ్చే విందుకు హాజరుకానున్నారు. రేపు ఉదయం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత మోదీ-పుతిన్ మధ్య భేటీ జరగనుంది. పుతిన్ కోసం NSG కమాండోలు, స్నైపర్స్, డ్రోన్లు, AIతో ఐదంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. 2021 తర్వాత మళ్లీ ఆయన భారత్కు రావడం ఇదే.
News December 4, 2025
నేడు భారీ వర్షాలు: APSDMA

AP: నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. బుధవారం 5PM వరకు తిరుపతి(D) తొట్టంబేడులో అత్యధికంగా 47.2మి.మీ. వర్షపాతం నమోదైందని తెలిపింది.
News December 4, 2025
ఆరుద్రలో అడ్డెడు చల్లినా పుట్టెడు పంట

ఆరుద్ర కార్తె అనేది వర్షాకాలం ప్రారంభంలో వ్యవసాయ పనులకు సరైన సమయం. ఈ కార్తెలో భూమిలో తగినంత తేమ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో అడ్డెడు( తక్కువ పరిమాణంలో) విత్తనాలు చల్లినా, అవి బాగా మొలకెత్తి పుట్టెడు(ఎక్కువ) పంటను ఇస్తాయని రైతుల విశ్వాసం. ఈ సామెత ఆరుద్ర కార్తెలో విత్తనాలు వేయడం, అప్పటి వర్షాలు.. పంటకు ఎంత అనుకూలంగా ఉంటాయో తెలియజేస్తుంది.


