News January 24, 2025
KMR: పేదలకు లబ్ధి చేకూర్చాలి: కలెక్టర్

పేదలకు లబ్ధి చేకూర్చాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 36వ వార్డులో ప్రజాపాలన వార్డు సభలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. వార్డు సభలో ముసాయిదా జాబితాను చదవడం జరుగుతుందని, వాటిలో అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలన్నారు. జాబితాలో పేరు రానివారు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు స్వీకరించడం నిరంతర ప్రక్రియ అని ఆయన వెల్లడించారు.
Similar News
News February 7, 2025
బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచకపోతే రేవంత్ చిట్టా విప్పుతా: కృష్ణయ్య

బీసీలకు 42% రిజర్వేషన్లను పెంచకపోతే సీఎం రేవంత్ రెడ్డి చిట్టా విప్పుతామని రాజ్యసభ ఎంపీ ఆర్?కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేకిగా మారారని కామెంట్ చేశారు. బీసీల అణచివేతకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. బీసీ జనాభాను తక్కువ చేసి చూపించి అన్ని రంగాల్లో, రిజర్వేషన్లలో అవకాశాలు రాకుండా అడ్డుకునేలా చేస్తున్నారన్నారు.
News February 7, 2025
ప్రధాని మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన ఖరారు

ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు పీఎంవో తెలిపింది. ఈ నెల 10, 11 తేదీల్లో ఫ్రాన్స్‌లో ఆ దేశ అధ్యక్షుడు మెక్రాన్‌తో కలిసి ఏఐ సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. అలాగే అక్కడ ఉన్న థర్మో న్యూక్లియర్ రియాక్టర్‌ను సందర్శించనున్నారు. అనంతరం 12, 13 తేదీల్లో అమెరికాలో ప్రధాని పర్యటించనున్నారు. ట్రంప్ ఆహ్వానం మేరకు ఆయన US వెళ్లనున్నారు.
News February 7, 2025
ఉట్నూర్: 9 నుంచి జాతర క్రీడాపోటీలు

ఉట్నూర్ మండలంలోని శ్యామ్ పూరులో బుడుందేవ్ జాతర అంగరంగవైభవంగా కొనసాగుతుంది. ఈ నెల 9 నుంచి 10వ తేదీ వరకు రెండు రోజుల పాటు కబడ్డీ, వాలీబాల్ పోటీలను నిర్వహించనున్నట్లు మేనేజిమెంట్ సభ్యుడు పెందూర్ రాజేశ్వర్ శుక్రవారం తెలిపారు. గెలుపొందిన వారికీ బహుమతులు అందజేస్తామన్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని క్రీడాకారులు హాజరుకావాలని వారు కోరారు.