News January 30, 2025
KMR: పోక్సో కేసులో నిందితుడికి 5 ఏళ్ల జైలు శిక్ష

పోక్సో చట్టం కేసులో నిందితుడికి 5 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమాన విధిస్తూ కామారెడ్డి జిల్లా అదనపు జడ్జి లాల్ సింగ్ బుధవారం తీర్పుచ్చినట్లు జిల్లా SP సింధు శర్మ తెలిపారు. వడ్లూరుకు చెందిన షేక్ కరీం 2020లో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె కుటుంబీకులు దేవునిపల్లి PSలో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్ఐ జ్యోతి కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా, జడ్జీ బుధవారం తీర్పునిచ్చారు.
Similar News
News November 8, 2025
VJA: ప్రేమ పేరుతో మోసం

చిలకలపూడికి చెందిన మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసిన అదే గ్రామానికి చెందిన బాలుడు, అతడికి సహకరించిన స్నేహితుడు, స్నేహితుడి కుటుంబ సభ్యులకు విజయవాడ పోక్సో కోర్టు శుక్రవారం రిమాండ్ విధించింది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ స్పందిస్తూ, బాలికలను ప్రేమ పేరుతో వేధించే వారిని సహించేది లేదని హెచ్చరించారు.
News November 8, 2025
నరసన్నపేట: పంచలోహ విగ్రహాల అప్పగింత

నరసన్నపేటలోని సిద్ధాశ్రమంలో ఏడు పంచలోహ విగ్రహాలు చోరీకి గురైన విషయం తెలిసిందే. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ శ్రీనివాసరావు, ఎస్సై దుర్గాప్రసాద్ నిందితుడి వద్ద సమాచారం రాబట్టి, విగ్రహాలను సిద్ధాశ్రమ నిర్వాహకులకు శుక్రవారం రాత్రి అందజేశారు.
News November 8, 2025
సూర్యాపేట డిప్యూటీ డీఎంహెచ్ఓగా వేణుగోపాల్

సూర్యాపేట డిప్యూటీ డీఎంహెచ్ఓగా డాక్టర్ వేణుగోపాల్ నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన హుజూర్నగర్ మండలం లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు ఈ పదవిలో ఉన్న జయ మనోహరి పదోన్నతిపై వెళ్లడంతో, ఆ స్థానంలో డా.వేణుగోపాల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నియామకం పట్ల వైద్యులు, పారామెడికల్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.


