News February 4, 2025

KMR: పోక్సో చట్టంపై ఓరియంటేషన్

image

కలెక్టరేట్ సముదాయంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పోక్సో చట్టంపై అధ్యాపక సిబ్బందికి ప్రత్యేకమైన ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించినట్లు కామారెడ్డి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి ప్రమీల తెలిపారు. పోక్సో చట్టంపై అవగాహన కల్పించే పోస్టర్లను కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ ఆవిష్కరించారు. ఎస్పీ సింధు శర్మ, ఆయాశాఖల సిబ్బంది, అధ్యాపకులు, ప్రిన్సిపల్స్, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 13, 2026

‘యువత’ జైలు పాలు

image

TG: మత్తు పదార్థాలు వినియోగం, పొక్సో కేసులు, డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారిలో యువతే ఎక్కువగా ఉంటోంది. 2025లో పలు కేసుల్లో 42,566 మంది జైలుకు వెళ్లగా వారిలో 19,413 మంది 18-30 ఏళ్ల వారేనని జైళ్ల శాఖ నివేదిక పేర్కొంది. 2024తో పోలిస్తే ఇది ఏకంగా 13% అధికమని తెలిపింది. 40,090 మంది తొలిసారి నేరం చేసి జైలు శిక్ష అనుభవించినట్లు వెల్లడించింది. గత ఏడాది 3,634 ఖైదీలు విడుదలైనట్లు పేర్కొంది.

News January 13, 2026

వరంగల్ మార్కెట్‌కి 5 రోజుల సుదీర్ఘ సెలవులు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి వరుసగా 5 రోజుల సెలవులు రానున్నాయి. ఈనెల 14న (బుధవారం) భోగి, 15న (గురువారం) సంక్రాంతి, శుక్రవారం కనుమ, శనివారం, ఆదివారం వారాంతపు సెలవు నేపథ్యంలో మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి ఐదు రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి సోమవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.