News February 18, 2025
KMR: పోలీసులకు డ్రైవింగ్ నైపుణ్యత చాలా ముఖ్యం: ఎస్పీ

అత్యవసర విభాగంలో పని చేసే పోలీసులకు డ్రైవింగ్ నైపుణ్యత చాలా ముఖ్యమని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. జిల్లా పోలీసు శాఖలో ఇటీవల 189 మంది నూతన పోలీస్ కానిస్టేబుళ్లు చేరారన్నారు. సివిల్ కానిస్టేబుళ్లు 115, ఆర్మ్డ్ రిజర్వు కానిస్టేబుళ్లు 74 మంది ఉన్నారన్నారు. వీరందరికీ అత్యవసర పరిస్థితుల్లో డ్రైవింగ్ రావాలనే ఉద్దేశంతో ఆరు వారాల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
Similar News
News March 15, 2025
ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ పనులు

కేంద్ర ప్రభుత్వం తనిఖీ చేసిన తరువాత వెలువరించే ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. శనివారం కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివ రావు అసెంబ్లీలో చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి స్పందించారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై సానుకూలంగా ఉన్నామని తెలిపారు.
News March 15, 2025
గెలవక ముందు జనసేనాని, గెలిచాక ‘భజన’ సేనాని: ప్రకాశ్ రాజ్

నిన్న రాత్రి జనసేన జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన <<15763560>>మాటలపై<<>> నటుడు ప్రకాశ్ రాజ్ ట్విటర్లో కౌంటర్ ఇచ్చారు. పవన్ గెలవక ముందు ‘జనసేనాని’, గెలిచిన తరువాత “భజన సేనాని” … అంతేనా? అని ప్రశ్నించారు. హిందీ వద్దంటూ దక్షిణాది రాష్ట్రాలకు మద్దతుగా పవన్ గతంలో చేసిన పోస్టుల్ని ట్వీట్‌కి జత చేశారు.
News March 15, 2025
గిర్నిబావి వద్ద కాల్పులు జరగలేదు: వరంగల్ సీపీ

కొమ్మాల జాతర సందర్భంగా గిర్నిబావిలో ప్రభ బండ్లు వరుస క్రమంలో తరలి వెళ్లే క్రమంలో కొంతమంది వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శించారని పోలీసులు తెలిపారు. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఆదేశాలను పాటించకుండా సదరు వ్యక్తులు ముందుకు వెళ్లారన్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ప్రభ బండ్లను తరలించే వారి మధ్య తోపులాట మాత్రమే జరిగిందని, ఎలాంటి పోలీస్ కాల్పులు జరగలేదని వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు.