News March 7, 2025

KMR: పోలీసులకు ప్రశంసా పత్రాలు

image

కామారెడ్డి జిల్లాలోని పోలీసు శాఖలో విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎస్‌ఐ, ఏఎస్ఐ లతో పాటు కానిస్టేబుల్ లకు కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధుశర్మ ప్రశంసా పత్రాలు అందజేసి, అభినందించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ అదే స్ఫూర్తి, అంకితభావంతో ప్రజలకు సేవలందించాలని పేర్కొన్నారు.

Similar News

News February 25, 2026

లండన్‌లో పెద్దాపురం యువకుడి మృతి

image

లండన్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో పెద్దాపురం కొండయ్యపేటకు చెందిన గొంతి అభిషేక్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు బుధవారం తెలిపారు. క్రోయిడాన్ డప్పాసి హిల్ టెర్రస్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో మరో యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు. 2023లో ఎంబీఏ చదివేందుకు అభిషేక్ లండన్ వెళ్లారు. అభిషేక్ మృతితో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

News February 25, 2026

ఫేక్ TTD వెబ్‌సైట్లపై పోలీసులకు ఫిర్యాదు

image

తిరుమలలో వసతి గదులు కల్పిస్తామంటూ నకిలీ వెబ్‌సైట్ల ద్వారా భక్తులను మోసం చేస్తున్న ఘటనలపై TTD అప్రమత్తమైంది. విజిలెన్స్ విచారణలో TTD పేరు, ఆలయ చిత్రాలను అనధికారికంగా ఉపయోగించి ఫేక్ వెబ్‌సైట్లు రూపొందించి ఆన్‌లైన్‌లో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తేలింది. దీంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కాపీరైట్ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

News February 25, 2026

తిరుమలలో శ్రీవారి ధర్మ రథాలకు విశేష ఆదరణ

image

తిరుమలలో టీటీడీ నిర్వహిస్తున్న ఉచిత ఎలక్ట్రిక్ బస్సులకు డిజిటల్ డిస్‌ప్లే బోర్డుల ఏర్పాటుతో మరింత ఆదరణ లభిస్తోంది. 12 బస్సులు రోజుకు 300 ట్రిప్పులు నిర్వహిస్తూ సుమారు 60 వేల మంది భక్తులను రవాణా చేస్తున్నాయి. డిజిటల్ బోర్డులను B.S. Technotronics Private Limited విరాళంగా అందించగా, సాంకేతిక సహకారం Olectra Greentech Limited అందిస్తోంది. రాత్రివేళల్లో అదనంగా 20 ట్రిప్పులు పెంచనున్నారు.