News March 11, 2025

KMR: ప్రజావాణికి 101 ఫిర్యాదులు

image

కామారెడ్డి కలెక్టరేట్ సమావేశం మందిరం వేదికగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన ప్రజావాణి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. స్వయంగా జిల్లా కలెక్టర్ బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. భూముల సమస్యలు, రెండు పడకల గదుల ఇళ్లు మంజూరు, రైతుభరోసా, మున్సిపల్ వార్డుల్లో పారిశుద్ధ్యం తదితర అంశాలపై 101 ఫిర్యాదులు వచ్చాయి. అర్జీలను పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News October 22, 2025

విశాఖలోనే మొదటి రీజినల్ ల్యాబ్

image

రాష్ట్రంలోని విశాఖలోనే తొలిసారిగా రీజినల్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. బుధవారం విశాఖ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఫుడ్ సేఫ్టీ శాఖలో సిబ్బంది కొరత ఉందని తెలిపారు. సచివాలయాల్లో ప్రతిభగల వారిని ఈ శాఖలోకి తీసుకువచ్చేందుకు అవకాశాలు పరిశీలిస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చిస్తామని వెల్లడించారు.

News October 22, 2025

NZB: ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్

image

నిజామాబాద్ వినాయకనగర్‌లోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఫైర్ ఆఫీసర్ శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వాల్, సిబ్బంది సాత్విక్, విజయేందర్ రెడ్డి ఉన్నారు.

News October 22, 2025

చిత్తూరులో కంట్రోల్ రూమ్

image

చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తాయన్నారు. లోతట్టు ప్రజలు వాగులు, వంకల వైపు వెళ్లరాదని సూచించారు. అత్యవసరమైతే ప్రజలు బయటకు రావాలని కోరారు. వర్షాలతో ఏదైనా ఇబ్బంది ఎదురైతే కంట్రోల్ రూము నంబర్లు 9491077325, 08572 242777కు కాల్ చేయాలని కోరారు.