News April 7, 2025
KMR: ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. కలెక్టర్ ఒక్కొక్క ఫిర్యాదును స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News April 8, 2025
దిల్‌సుఖ్‌నగర్ బాంబ్ బ్లాస్ట్.. నేడే తీర్పు

దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్లపై ఇవాళ తెలంగాణ హైకోర్టు తుది తీర్పు వెలువరించబోతుంది. 2013 FEB 21న జరిగిన ఈ బాంబ్ దాడిలో 18 మంది మృతి చెందగా, 130 మందికి గాయాలవ్వడం అప్పట్లో దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. నిందితులు యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి NIA కోర్టు ఉరిశిక్ష వేయగా, దీనిపై హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ పేలుళ్ల ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.
News April 8, 2025
గంజాయి తరలిస్తున్న నలుగురు అరెస్ట్

టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో నలుగురు యువకులు అక్రమంగా గంజాయి తరలిస్తున్నారని సమాచారం ఆధారంగా సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, ఎస్ఐ నాగమల్లేశ్వరావు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 4.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వల్ల యువత భవిష్యత్ దెబ్బతింటుందన్నారు. యువత చెడు మార్గాలను వదిలేయాలని సూచించారు.
News April 8, 2025
కమలాపురం: సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన తులసి రెడ్డి

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో సబర్మతి నది ఒడ్డున ఉన్న సబర్మతి ఆశ్రమాన్ని సోమవారం రాత్రి పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఏఐసీసీ సభ్యులు తులసిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీ నివసించిన ఇల్లు చూడటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అక్కడ ఆయన 12 సంవత్సరాలు నివసించారని తెలిపారు. ఇది మర్చిపోలేని ఘటన అని ఆయన అన్నారు.