News January 31, 2025
KMR: ప్రతిభ కనబరిచి..ప్రశంసా పత్రాలు అందుకొని..!

విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం వారిని అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రశంస పత్రాలు అందుకుంది వీరే.. భాస్కర్, రమేష్ (కానిస్టేబుళ్లు, కామారెడ్డి), రామస్వామి (కానిస్టేబుల్, దేవునిపల్లి), రాజగౌడ్ (కానిస్టేబుల్, బీక్నూర్), శ్రీహరి, భాస్కర్ (హోం గార్డ్స్, రాజంపేట్).
Similar News
News February 18, 2025
20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం.. వెంటనే నోటిఫికేషన్లు: మంత్రి

20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు చేసి 25 వేల ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. హైదరాబాదులోని టూరిజం కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. వర్గీకరణ చేసే వరకు నోటిఫికేషన్ ఇవ్వమని సీఎం చెప్పారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వచ్చే 20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు చేసి 25 వేల ఉద్యోగం నోటిఫికేషన్లు విడుదల చేస్తామని వెల్లడించారు.
News February 18, 2025
VJA: వివాహితకు వరకట్న వేధింపులు

విజయవాడలో ఓ వివాహితకు ఆమె కుటుంబం రూ.5 కోట్లు కట్నం ఇచ్చారు. అయినా సరిపోదంటూ పెళ్లైన రెండు రోజులకే వేధింపులు మొదలయ్యాయి. వేధింపులు తాళలేని ఆ వధువు ఆదివారం భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భర్త, మామపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. వీరిని కోర్టుకు హాజరు పరచగా.. 14 రోజుల రిమాండ్ విధించినట్లు చెప్పారు.
News February 18, 2025
నల్గొండలో రౌడీషీటర్ అరెస్ట్

NLGలోని రాక్ హిల్స్ కాలనీకి చెందిన రౌడీషీటర్ రాజేశ్‌ను అరెస్టు చేసినట్లు NLG డీఎస్పీ శివ రాంరెడ్డి సోమవారం తెలిపారు. ఇతనిపై సుమారు 17 హత్యకేసులు ఉన్నట్లు తెలిపారు. పట్టణంతో పాటు ఎల్బీనగర్ ఏరియాను అడ్డాగా చేసుకొని భూసెటిల్మెంట్లు, గంజాయి మత్తులో పలువురికి ఫోన్లు చేసి బెదిరిస్తుండటంతో బాధితుల ఫిర్యాదుతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.