News March 21, 2025
KMR: ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు..

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజైన గురువారం జనరల్ గ్రూప్ కు సంభందించి 6928 మంది పరీక్ష రాయాల్సి ఉండగా..148 మంది పరీక్షకు హాజరు కాలేదు. ఒకేషనల్ విభాగంలో 1093 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా, 1042 మంది మాత్రమే పరీక్ష రాశారని కామారెడ్డి జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. పరీక్షలు పూర్తి అవ్వడంతో విద్యార్థులు తమ ఇంటికి బయలుదేరారు.
Similar News
News December 12, 2025
పొగమంచు వేళల్లో వాహనాల రాకపోకలపై నిషేధం: అనిత

AP: ఏజెన్సీ ప్రాంతాల్లో వాహన ప్రమాదాల నేపథ్యంలో రాత్రి పూట పొగమంచు వేళల్లో బస్సు, ఇతర వాహన రాకపోకలను నిషేధిస్తున్నట్లు మంత్రి అనిత తెలిపారు. చింతూరు-మారేడుమిల్లి రోడ్డులో BUS ప్రమాదంలో 9మంది మృతి బాధాకరమన్నారు. ‘మృతుల కుటుంబాలకు పరిహారమిస్తాం. ఘాట్ రోడ్లలో వాహనాలు నడిపేవారికి ప్రత్యేక డ్రైవింగ్ లైసెన్స్ ఉండేలా చర్యలు తీసుకుంటాం. చిన్న తప్పిదాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి’ అని పేర్కొన్నారు.
News December 12, 2025
NHIDCL 64 పోస్టులకు నోటిఫికేషన్

<
News December 12, 2025
మాజీ సైనికులు పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

మాజీ సైనికుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. ‘స్పర్శ’ కార్యక్రమం ద్వారా మాజీ సైనికులు, వారి వితంతువులకు పింఛను నేరుగా బ్యాంకు ఖాతాలకు చేరుతుందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి, పింఛను అవగాహనకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మాజీ సైనికులు సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఆయన కోరారు.


