News March 21, 2025
KMR: ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు..

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజైన గురువారం జనరల్ గ్రూప్ కు సంభందించి 6928 మంది పరీక్ష రాయాల్సి ఉండగా..148 మంది పరీక్షకు హాజరు కాలేదు. ఒకేషనల్ విభాగంలో 1093 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా, 1042 మంది మాత్రమే పరీక్ష రాశారని కామారెడ్డి జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. పరీక్షలు పూర్తి అవ్వడంతో విద్యార్థులు తమ ఇంటికి బయలుదేరారు.
Similar News
News April 17, 2026
20న జేఈఈ మెయిన్ ఫలితాలు!

జేఈఈ మెయిన్-2026 ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. jeemain.nta.nic.inలో అప్లికేషన్ నంబర్, బర్త్ డేట్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. కాగా ఈ నెల 2 నుంచి 8 వరకు జరిగిన సెషన్-2 పరీక్షలకు దేశవ్యాప్తంగా 11 లక్షల మందికి పైగా హాజరయ్యారు. NIT, IITలలో ప్రవేశాల కోసం జేఈఈ ఎగ్జామ్స్‌ను రెండు దశల్లో నిర్వహిస్తారు.
News April 17, 2026
కామారెడ్డి: ఈ నెల 19న ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష

కామారెడ్డి జిల్లాలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్షను ఈ నెల 19 (ఆదివారం) నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఉంటుంది. 7వ నుంచి 10వ తరగతి ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఉంటుంది. www.tgms.telangana.gov.inలో హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
News April 17, 2026
ఉమ్మడి జిల్లా జెడ్పీ సీఈవోగా విజయలక్ష్మి

ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ సీఈవోగా విజయలక్ష్మి నియమితులయ్యారు. ప్రస్తుతం గుంతకల్లు డీడీవోగా పనిచేస్తున్న ఆమెను జెడ్పీ రెగ్యులర్ సీఈవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొంతకాలంగా ఆమె నియామకంపై సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. శుక్రవారం విడుదలైన ఆదేశాల మేరకు ఆమె త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.


