News March 30, 2025
KMR: ప్రశ్నలు లీక్ మరొకరి అరెస్ట్: SP

జుక్కల్‌లో పరీక్షా కేంద్రం నుంచి గణిత పరీక్ష ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అయినా కేసులో ఆరుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా మరో ఇద్దరు పరారీలో ఉండగా ఇందులో A8గా ఉన్న నయిూం ఖాన్‌ను శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు SP రాజేశ్ చంద్ర తెలిపారు. సామాజిక మాధ్యమాన్ని పరిమితులకు లోబడి వినియోగించాలని ఇబ్బంది కలిగించేలా పోస్టులు చేస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
Similar News
News December 23, 2025
పిల్లలను అమ్మే ముఠా కోసం 5 ప్రత్యేక బృందాలతో సిట్ ఏర్పాటు

విజయవాడలో పిల్లలను అమ్మే ముఠా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో లోతైన విచారణ కోసం నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేశారు. అడ్మిన్ డీసీపీ ఆధ్వర్యంలో 5 ప్రత్యేక బృందాలతో సిట్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇప్పటికే ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ, ముంబైతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విచారణ చేపట్టేందుకు సిట్‌ను నియమించామన్నారు.
News December 23, 2025
HYD: ఆస్తిపన్ను వడ్డీపై 90% రాయితీ అందుకే!

2025- 2026 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్నుతో పాటు పేరుకుపోయిన పాత బకాయిలు చెల్లించే వారికి GHMC బకాయిల వడ్డీలపై 90% రాయితీ ప్రకటించింది. గతంలో ఇది మంచి ఫలితాలు ఇవ్వడంతో అధికారులు మరోసారి దీన్ని ప్రవేశపెట్టారు. 2022-23లో రూ.170 కోట్లు, 2023- 24లో రూ.320 కోట్లు, 2024-25లో రూ.466 కోట్లుగా పెరుగుతూ వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం ఆస్తి పన్ను చెల్లించే వారికి ఈ సదుపాయం ఉంటుంది.
# SHARE IT
News December 23, 2025
ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఇదే: పేటీఎం CEO

ప్రపంచానికి భారత్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటనే ప్రశ్నకు పేటీఎం CEO విజయ్ శేఖర్ శర్మ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. ‘మర్చంట్ పేమెంట్ QR కోడ్’ ఇండియా తర్వాతే ప్రపంచమంతా ప్రారంభమైందని చెప్పారు. చైనాలోనూ కన్జూమర్ QR కోడ్ మాత్రమే ఉండేదని.. మన దగ్గర వ్యాపారులే ఈ టెక్నాలజీ వాడి విప్లవం తెచ్చారన్నారు. చిల్లర కష్టాలు తీర్చిన ఈ వ్యవస్థ భారత్ గర్వించదగ్గ ఇన్నోవేషన్ అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


