News April 14, 2025

KMR: ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ-22 పనులు చేపట్టాలి: షబ్బీర్ అలీ

image

ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ-22 పనులు చేపట్టాలని, భూసేకరణ నిధులు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కోరారు. ఆదివారం ఎర్రమంజిల్లోని జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నీటిపారుదల శాఖ సమీక్ష జరిగింది. ఉమ్మడి NZB జిల్లాకు చెందిన రిజర్వాయర్, ప్రాజెక్టుల పెండింగ్ పనులు, మరమ్మత్తులపై మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు షబ్బీర్ అలీ పేర్కొన్నారు.

Similar News

News December 3, 2025

శ్రీశైల మల్లన్న సన్నిధిలో టీమిండియా క్రికెటర్లు

image

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను టీమిండియా క్రికెటర్లు జితేశ్ శర్మ, రవి బిష్ణోయ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనార్థమై బుధవారం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న వారికి అధికారులు, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేద ఆశీర్వచనాలు అందజేసి, శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాలతో వారిని సత్కరించారు. వారివెంట దేవస్థానం ఏపీఆర్ఓ డాక్టర్ శివారెడ్డి ఉన్నారు.

News December 3, 2025

మరోసారి వార్తల్లో కర్ణాటక సీఎం.. వాచ్ ప్రత్యేకతలివే

image

కర్ణాటకలో కుర్చీ వివాదం సద్దుమణగక ముందే CM సిద్దరామయ్య మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. శాంటోస్ డి కార్టియర్ మోడల్ లగ్జరీ వాచ్ ధర రూ.43 లక్షల 20 వేలు. 18K రోజ్ గోల్డ్‌తో తయారైంది. సిల్వర్ వైట్ డయల్‌లో గంటలు, నిమిషాలు, సెకన్ల పిన్స్ సెల్ఫ్ వైండింగ్ మెకానికల్ మూవ్‌మెంట్‌తో పని చేస్తాయి. 6వ నంబర్ ప్లేస్‌లో డేట్ ఫీచర్, 39.88mm వెడల్పు, 9mm మందం ఉంది.

News December 3, 2025

వరంగల్ మార్కెట్లో పెరిగిన మొక్కజొన్న ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పల్లికాయ, మొక్కజొన్న ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పచ్చి పల్లికాయ రూ.5,400 ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. మొక్కజొన్నకు రూ.1,945 ధర వచ్చిందన్నారు. కాగా, గత రెండు రోజులతో పోలిస్తే నేడు మొక్కజొన్న ధర పెరిగింది. మక్కలు బిల్టీకి సోమవారం రూ.1,935 ధర రాగా, మంగళవారం రూ.1,905 ధర వచ్చింది.