News March 22, 2025
KMR: ప్రేమ పేరుతో వివాహం.. కుల వివక్షతతో పారిపోయిన భర్త

లింగంపేట్ మండలం కొమాట్‌పల్లికి చెందిన నెల్లూరి భాగ్య అదే గ్రామానికి చెందిన చిటురి రాకేశ్ ప్రేమ వివాహం చేసుకుని కడుపులో బిడ్డను చంపి అన్యాయం చేశాడని బాధితురాలు ఆరోపించింది. రోడ్డుపై వదిలేసి వెళ్లిపోడంటూ.. భర్త ఇంటి ఎదుట శుక్రవారం భార్య ఆందోళనకు దిగింది. 2023లో యాదగిరి గుట్టలో ప్రేమవివాహం చేసుకోని, మోసం చేసి పారిపోయాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో ఆందోళన చేపట్టింది.
Similar News
News March 26, 2025
KNR: సరైన అవగాహన.. సైబర్ నేరాలకు నివారణ

కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో రాష్ట్ర విద్యా కమిషన్ సలహాదారులు ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై రైసింగ్ సన్ యూత్ క్లబ్ సహకారంతో కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈజీ మనీ కోసం ఆశపడి అందమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. బెట్టింగ్ నడిపే వారితో పాటు బెట్టింగ్‌లో పాల్గొనే వారిపై నిఘా ఉంటుందని అన్నారు.
News March 26, 2025
కొడాలి నాని ఆరోగ్యంపై స్పందించిన ఆయన టీమ్

AP:వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యంపై వచ్చిన వార్తల విషయంలో ఆయన టీమ్ ట్విటర్లో స్పందించింది. ‘కొడాలి నాని గారు గ్యాస్ట్రిక్ సమస్యతో ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన క్షేమంగా ఉన్నారు’ అని వెల్లడించింది. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈరోజు ఉదయం ఆయనకు గుండెపోటంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
News March 26, 2025
ధరణిని బంగాళాఖాతంలో వేయాలనే ప్రజలు అధికారం ఇచ్చారు: భట్టి

TG: ఒక్క కలం పోటుతో భూమిపై హక్కులు లేకుండా చేసిన దుర్మార్గమైన చట్టమే ధరణి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. అలాంటి ధరణిని బంగాళాఖాతంలో వేయాలనే ప్రజలు తమకు అధికారం కట్టబెట్టారని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. అందుకే దాన్ని బంగాళాఖాతంలో వేసి, భూభారతి తెచ్చామని పేర్కొన్నారు. అనేక చట్టాలు, పోరాటాల ద్వారా వచ్చిన భూహక్కులను బీఆర్ఎస్ ప్రభుత్వం కాలరాసిందని భట్టి మండిపడ్డారు.