News January 29, 2025
KMR: ఫిబ్రవరి 3 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్: కలెక్టర్

ఇంటర్ ప్రాక్టికల్, థియరీ పరీక్షలు పక్కడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు, మార్చి 5 నుంచి 25 వరకు 38 కేంద్రాల్లో థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Similar News
News November 16, 2025
NLG: రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేత

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకువచ్చిన కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ జిన్నింగ్ మిల్లుల యజమానులు సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేయాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 25 జిన్నింగ్ మిల్లులు ఉండగా తొలుత 9 సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సీసీఐ విధించిన కొత్త నిబంధనలు రైతులు, తమకు ఆటంకంగా మారుతున్నాయని జిన్నింగ్ యజమానులు ఆరోపిస్తున్నారు.
News November 16, 2025
పల్నాడు యుద్ధ వీరుల ఆయుధాల గురించి మీకు తెలుసా.?

11వ శతాబ్దంలో పల్నాడు యుద్ధంలో వీరులు ఉపయోగించిన ఆయుధాలు నేటికీ సజీవంగా పూజలు అందుకుంటున్నాయి. మహామంత్రి బ్రహ్మనాయుడు ఉపయోగించిన నృసింహకృతం, బాలచంద్రుడు వాడిన సూర్య బేతాళం, సర్వ సైన్యాధ్యక్షుడు మాల కన్నమదాసు భైరవ ఖడ్గం నేటికీ కారంపూడి వీరుల దేవాలయం, మాచర్ల చెన్నకేశవస్వామి ఆలయంలో పూజింపబడుతున్నాయి. ఉత్సవాలకు వీటిని బయటకు తెచ్చి యుద్ధ రీతులలో ప్రదర్శించి ముగింపు అనంతరం తిరిగి భద్రపరుస్తారు.
News November 16, 2025
SBIలో 103 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు.. అప్లై చేశారా?

SBIలో 103 కాంట్రాక్ట్ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, PG, CA, CFA,CFP,MBA, పీజీ డిప్లొమా, PGDM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వయసు 25-50ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.750, SC, ST, PWBDలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://sbi.bank.in/


