News January 31, 2025
KMR: ఫుడ్ పాయిజన్ అవాస్తవం: సబ్ కలెక్టర్

బీర్కూరు మండలం రైతునగర్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్నం భోజనం వికటించి 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వస్తున్న కథనాలపై బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి స్పందించారు. తక్షణమే సంబంధిత అధికారులతో విచారణకు ఆదేశించానన్నారు. ఆ పాఠశాలలో ఏ ఒక్క విద్యార్థి కూడా ఫుడ్ పాయిజన్కు గురి కాలేదని ఆమె స్పష్టం చేశారు. మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని ఆమె ‘Way2 news’ తో పేర్కొన్నారు.
Similar News
News December 6, 2025
చిన్న చీమ పెద్ద మనసు.. చావడానికీ వెనుకాడదు!

కష్టం, క్రమశిక్షణకు మారుపేరైన చీమల గురించి ఓ ఆసక్తికర విషయం వెల్లడైంది. తీవ్రంగా జబ్బుపడిన చీమలు తమ జాతిని కాపాడుకోవడానికి ప్రాణత్యాగానికి సిద్ధమవుతాయని ఆస్ట్రియా పరిశోధకుల స్టడీలో తేలింది. అనారోగ్యానికి గురైనవి రసాయన వాయువు రిలీజ్ చేసి ‘డేంజర్’, ‘నన్ను చంపండి’ అనే సిగ్నల్ ఇస్తాయని సైంటిస్టులు చెప్పారు. దీంతో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఆ చీమ గూడును ఇతర చీమలు చీల్చివేస్తాయని తెలిపారు.
News December 6, 2025
గద్వాల్: మూడో విడతలో 438 నామినేషన్లు

మూడో విడత నామినేషన్ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది. అల్లంపూర్ సర్పంచ్ (90), వార్డు మెంబర్లకు (282), ఇటిక్యాల సర్పంచ్ (63), వార్డ్ మెంబర్లు(244), మానవపాడు సర్పంచ్ (87), వార్డు మెంబర్లు (320), ఎర్రవల్లి సర్పంచ్ (98), వార్డ్ మెంబర్లు (330), ఉండవెల్లి సర్పంచ్ (100), వార్డ్ మెంబర్లు (330) మొత్తం 438 సర్పంచ్, 1489 వార్డు మెంబర్ నామినేషన్లు దాఖలయ్యాయి.
News December 6, 2025
గ్రీవ్స్ డబుల్ సెంచరీ.. NZ-WI తొలి టెస్టు డ్రా

న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు డ్రాగా ముగిసింది. 531 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 72కే 4 వికెట్లు పడినా జస్టిన్ గ్రీవ్స్(202*) అద్భుత పోరాటం చేశారు. షాయ్ హోప్(140), కీమర్ రోచ్(58*)తో కలిసి న్యూజిలాండ్కు చుక్కలు చూపెట్టారు. దాదాపు గెలిపించినంత పని చేశారు. కానీ 5వ రోజు కావడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. స్కోర్లు: ఫస్ట్ ఇన్నింగ్స్: NZ-231/10, WI-167/10, సెకండ్ ఇన్నింగ్స్: NZ-466/8D, 457/6.


