News January 31, 2025
KMR: ఫుడ్ పాయిజన్ అవాస్తవం: సబ్ కలెక్టర్

బీర్కూరు మండలం రైతునగర్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్నం భోజనం వికటించి 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వస్తున్న కథనాలపై బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి స్పందించారు. తక్షణమే సంబంధిత అధికారులతో విచారణకు ఆదేశించానన్నారు. ఆ పాఠశాలలో ఏ ఒక్క విద్యార్థి కూడా ఫుడ్ పాయిజన్‌కు గురి కాలేదని ఆమె స్పష్టం చేశారు. మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని ఆమె ‘Way2 news’ తో పేర్కొన్నారు.
Similar News
News February 15, 2025
తాడికొండలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

తాడికొండ మండల పరిధిలోని బేజాత్ పురం గ్రామ పొలాల్లో గుర్తుతెలియని వృద్ధురాలి (70) మృతదేహం లభ్యమైంది. తాడికొండ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఘటనా స్థలానికి ఎస్ఐ జైత్యా నాయక్ చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. వీఆర్వో రవిబాబు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. వృద్ధురాలి ఆచూకీ తెలిసినవారు తాడికొండ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు.
News February 15, 2025
జయలలిత బంగారు ‘ఖజానా’!

మాజీ సీఎం జయలలిత ఆస్తులు, పత్రాలను తమిళనాడు ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు అధికారులు అప్పగించారు. ఇందులో 27 కిలోల బంగారం, 1,116 కిలోల వెండి, రత్నాలు, వజ్రాభరణాలు, 10 వేల చీరలు, 750 జతల చెప్పులు, 1,672 ఎకరాల భూముల పత్రాలు, ఇళ్ల దస్తావేజులు, 8,376 పుస్తకాలు ఉన్నాయి. వీటన్నింటిని 6 ట్రంకు పెట్టెల్లో తీసుకువచ్చి అప్పగించారు. వీటి విలువ ప్రస్తుతం రూ.4,000 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
News February 15, 2025
BHPL: నేడు డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు

2008 డీఎస్సీలో అర్హత సాధించిన ఎస్‌జీటీ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వారిని కాంట్రాక్ట్ టీచర్లుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు HNK డీఈవో కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేశారు.ఉమ్మడి జిల్లాలో 295 మంది అభ్యర్థులకు గాను 182 మంది అభ్యర్థులు వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. నేడు BHPL జిల్లాకు చెందిన 8 మందికి నియామకపత్రాలు అందజేయనున్నారు. వీరికి నెలకు రూ.31,040 జీతం ఇవ్వనున్నారు.