News March 26, 2025

KMR: బాలుడి అమ్మకం కేసును ఛేదించిన పోలీసులు

image

కామారెడ్డిలోని వీక్లీ మార్కెట్లో కంస్యపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు తమకు పుట్టిన మగ బిడ్డను అమ్మకానికి పెట్టిన ఘటనకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. డబ్బుల విషయంలో వాగ్వాదం రావడంతో స్థానికులు తమకు సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి వెళ్లి పేరెంట్స్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి బాలుడిని అప్పగించారు. పెట్రోలింగ్ , బ్లూకార్డ్ సిబ్బందిని ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు.

Similar News

News December 11, 2025

విజయనగరంలో బ్రదర్ అనిల్

image

విజయనగరం పాస్టర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురజాడ కళా భారతి ఆడిటోరియంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు బుధవారం రాత్రి విశేషంగా నిర్వహించారు. క్రైస్తవ సోదరులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రముఖ పాస్టర్ బ్రదర్ అనిల్ కార్యక్రమానికి వచ్చి దైవ సందేశాన్ని అందించారు. క్రిస్మస్ అనేది కేవలం వేడుక మాత్రమే కాదని, మనుషుల మధ్య ప్రేమ, సేవ, క్షమ, దయ వంటి విలువలను పంచే పవిత్రమైన సందర్భమని ఆయన పేర్కొన్నారు.

News December 11, 2025

ములుగు: 2 గంటల్లో.. 13.31 శాతం ఓటింగ్

image

ములుగు జిల్లాలో పోలింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లోనే 13.31% ఓట్లింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల వరకు గోవిందరావుపేట మండలంలో 10.65%, ఏటూరునాగారం – 10.86, తాడ్వాయిలో 20.03% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎన్నికల పరిశీలకులు, అధికారులు మండలాల వారీగా పర్యటిస్తూ పోలింగ్ సరలిని పర్యవేక్షిస్తున్నారు.

News December 11, 2025

ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>ఉడిపి<<>> కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 13పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మాజీ నేవీ సిబ్బంది జనవరి 6న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా(మెకానికల్/మెరైన్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. కమిషనింగ్ ఇంజినీర్‌కు నెలకు రూ.50వేలు, కమిషనింగ్ అసిస్టెంట్‌కు రూ.48వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://udupicsl.com