News April 8, 2025
KMR: బాలుర అదృశ్యం సుఖాంతం.. SP అభినందన

ఇద్దరు బాలుర అదృశ్యం కేసును బీర్కూర్ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. వివరాల్లోకి వెళితే.. బీర్కూర్ జ్యోతిబాఫూలేలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు 7వ తేదీన రాత్రి 9 గం.ల నుంచి కనిపించకుండా పోయారు. 8న సాయంత్రం కుటుంబ సభ్యులు PSలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వారిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందించారు.
Similar News
News November 16, 2025
ఈరోజు వీటిని తినకూడదట.. ఎందుకంటే?

కార్తీక మాసంలో ఆదివారం రోజున ఉసిరి, కొబ్బరిని ఆహారంగా తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు. ‘ఉసిరి చెట్టు లక్ష్మీదేవి స్వరూపం. విష్ణు కొలువై ఉండే వృక్షంగా దీన్ని భావిస్తారు. కొబ్బరి కూడా పవిత్రమైన పూజా ద్రవ్యం. సూర్యభగవానుడికి అంకితమైన ఈ ఆదివారం రోజున ఈ పవిత్ర వృక్షాలను గౌరవించాలి. వాటి ఫలాలను ఆహారంగా స్వీకరించడం ధర్మం కాదని గ్రహించాలి. ఈ నియమాలు పాటిస్తే శుభాలు కలుగుతాయి’ అని సూచిస్తున్నారు.
News November 16, 2025
ఆవుండగా గాడిద పాలు పితికినట్లు

ఒక పనిని సులభంగా, సరైన మార్గంలో చేసే అవకాశం లేదా వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ.. దానిని విస్మరించి, కష్టమైన, పనికిరాని, అసాధ్యమైన మార్గాన్ని ఎంచుకున్న సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. అందుబాటులో ఉన్న మంచి అవకాశాన్ని వదులుకుని అనవసరమైన శ్రమకు పోవడాన్ని ఈ సామెత సూచిస్తుంది.
News November 16, 2025
వణికిస్తున్న చలి.. పడిపోయిన ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 3-5 డిగ్రీల మేర తగ్గిపోయాయి. దీంతో APలోని అల్లూరి(D) అరకులో అత్యల్పంగా 7 డిగ్రీలు నమోదయ్యాయి. TGలోని సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో 8.1 డిగ్రీలు రికార్డయ్యాయి. ఆసిఫాబాద్లో 8.4, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 8.6 చొప్పున నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది.


