News January 30, 2025
KMR: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించిన తపస్

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని జిల్లా అధ్యక్షుడు పుల్గం రాఘవరెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. స్టేట్ కమిటీ ఆదేశాల మేరకు బీజేపీ బలపరిచిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులైన మల్క కొమరయ్య, సి.అంజిరెడ్డిలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు
Similar News
News February 14, 2025
రీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి: జాయింట్ కలెక్టర్

పకడ్బందీగా రీ సర్వే జరిగేలా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం సంబేపల్లి తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామస్థాయిలో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు సదస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
News February 14, 2025
నిర్మల్: ‘అలేఖ్య కేసులో మిగిలిన వారికి కూడా శిక్ష పడాలి’

అలేఖ్య కేసులో మిగిలిన వారికి కూడా శిక్ష పడాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు శుక్రవారం నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిలను వారి కార్యాలయంలో కలిసి విన్నవించారు. బాధితులు మాట్లాడుతూ.. అలేఖ్య హత్య కేసులో నిందితుడికి బుధవారం కోర్టు శిక్ష విధించిందని, అందుకు కారణమైన మిగతా ఇద్దరికీ శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్పీ స్పందిస్తూ హైకోర్టులో అపీలు చేస్తామని తెలిపారు.
News February 14, 2025
ప్రేమికుల రోజు భార్యలతో క్రికెటర్లు!

వాలంటైన్స్ డే సందర్భంగా పలువురు క్రికెటర్లు తాము ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యలతో గడిపారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలితో కలిసి స్పెషల్ లంచ్‌కు వెళ్లిన ఫొటోను షేర్ చేశారు. మరో కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇద్దరూ కలిసి షాపింగ్ చేస్తూ సందడిగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.