News March 29, 2025
KMR: బీసీ విద్యార్థులకు ఉచిత శిక్షణ

HYD స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో BC విద్యార్థులకు నెల పాటు నాన్ రెసిడెన్షియల్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అధికారిని బి.స్రవంతి శుక్రవారం తెలిపారు. శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు ప్రైవేటు బ్యాంకుల్లో ప్లేస్‌మెంట్ కల్పిస్తారని పేర్కొన్నారు. డిగ్రీ పూర్తి చేసి 26 సంవత్సరాల లోపు ఉన్న వారు అర్హులని ఆమె తెలిపారు.
Similar News
News February 23, 2026
వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరాకు పూర్తి సన్నాహాలు: ఎస్‌ఈ గంగాధర్

NPDCL పరిధిలో విద్యుత్ డిమాండ్ 5,904 మెగావాట్లకు చేరిందని PDPL సర్కిల్ ఎస్‌ఈ గంగాధర్ తెలిపారు. వేసవిలో పీక్ లోడ్‌ను ఎదుర్కొనేందుకు 126 కొత్త డీటీల ఏర్పాటు, 12 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, 11 సబ్‌స్టేషన్లు నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. 26 బ్రేకర్లు, 15 ఇంటర్‌లింకింగ్ లైన్లు ఏర్పాటు చేసి సరఫరా నాణ్యత మెరుగుపరిచామని, అంతరాయం లేకుండా విద్యుత్ అందించేందుకు సన్నాహాలు పూర్తిచేసినట్లు స్పష్టం చేశారు.
News February 23, 2026
TGలో ఎల్లుండి నుంచి ఇంటర్ పరీక్షలు

TG: ఈ నెల 25 నుంచి జరిగే ఇంటర్ పరీక్షల కోసం 1,495 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు బోర్డు వెల్లడించింది. ఫస్ట్, సెకండియర్ కలిపి 9,97,075 మంది ఎగ్జామ్స్ రాయనున్నారు. 9AM నుంచి 12PM వరకు పరీక్షలు జరుగుతాయని, స్టూడెంట్స్ 1hr ముందే ఎగ్జామ్ సెంటర్‌కి చేరుకోవాలని బోర్డు సూచించింది. హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా అనుమతిస్తామని, HTలు జారీ చేయని కాలేజీలపై చర్యలుంటాయని హెచ్చరించింది.
News February 23, 2026
NZB: డెస్క్ జర్నలిస్ట్‌లకు అక్రిడిటేషన్ ఇవ్వాలి: DJFT

మీడియాలో పని చేసే ప్రతి డెస్క్ జర్నలిస్ట్‌కు అక్రిడిటేషన్ ఇవ్వాలని డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (DJFT) నాయకులు కోరారు. నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠికి సోమవారం వినతిపత్రం అందజేశారు. ప్రతి డెస్క్ జర్నలిస్ట్‌కు ప్రభుత్వం అక్రిడిటేషన్లు ఇవ్వాలని, అక్రిడిటేషన్ జిల్లా కమిటీలో డెస్క్ జర్నలిస్ట్‌లను నియమించాలని కోరారు. ప్రతి జిల్లాలో 5 అక్రిడిటేషన్‌లు ఇవ్వాలని కోరారు.


