News January 25, 2025
KMR: బ్యాంకింగ్ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్

కామారెడ్డి జిల్లాకు చెందిన BC, SC,ST అభ్యర్థులకు RRB, SSC బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ పౌండేషన్ కోర్సులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అధికారిని స్రవంతి శుక్రవారం తెలిపారు. అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 9లోపు www.tgbcstudycircle.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ వచ్చే నెల 12 నుంచి 14 వ తేదీ వరకు ఉంటుందని పేర్కొన్నారు.
Similar News
News November 5, 2025
NTR: గురుకుల విద్యార్థులకు నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్

ఇంటర్ చదివి, నీట్ పరీక్ష రాసిన ఏపీఎస్డబ్ల్యూఆర్, ఏపీటీడబ్ల్యూఆర్ గురుకులాల విద్యార్థులకు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని NTR జిల్లా DCO ఎ. మురళీకృష్ణ తెలిపారు. విజయవాడ అంబేడ్కర్ స్టడీ సర్కిల్లో ఉచిత వసతి, భోజన సదుపాయాలతో సబ్జెక్టు నిపుణుల ద్వారా శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News November 5, 2025
ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ కప్ విన్నర్లు

వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళల జట్టు ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్ నుంచి ప్రత్యేక బస్సులో PM నివాసానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఒక్కో ప్లేయర్ను ప్రత్యేకంగా మోదీ అభినందించారు. తర్వాత వారిని సన్మానించారు. బంగ్లాదేశ్తో మ్యాచులో గాయపడిన ప్రతికా రావల్ వీల్ఛైర్లో రావడం గమనార్హం. అంతకుముందు ముంబై నుంచి ఢిల్లీకి వచ్చిన ప్లేయర్లకు ఘన స్వాగతం లభించింది.
News November 5, 2025
HYD: రేవంత్ రెడ్డికి KTR కౌంటర్

జూబ్లీహిల్స్ బైఎలక్షన్ రోడ్ షోలో సీఎం వ్యాఖ్యలకు KTR స్పందించారు. ‘భారత రాజ్యాంగం ఆర్టికల్స్ 25-28 ద్వారా మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా ఇచ్చింది. దీనికి అంబేడ్కర్ కృషి చేశారు. ప్రతి పౌరుడు తన మతాన్ని స్వేచ్ఛగా పాటించడానికి, ప్రచారం చేయడానికి ఈ హక్కు అనుమతిస్తుంది. రాజకీయ చర్చలతో లౌకిక రాజ్యమైన భారత్ గొప్పతనాన్ని అపహాస్యం చేయొద్దు’ అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.


