News January 17, 2025

KMR: భారత వాయు సేనలో కొలువులు

image

భారత వాయు సేనలో గ్రూప్ Y (మెడికల్ అసిస్టెంట్) ఉద్యోగాల్లో చేరేందుకు అర్హులైన అభ్యర్థులకు రిక్రూట్మెంట్ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా యువజనుల, క్రీడల శాఖ అధికారి జగన్నాథన్ తెలిపారు. మరిన్ని వివరాలకు సంబంధిత వెబ్ సైట్‌లో చూడాలన్నారు. అలాగే అగ్నివీర్ వాయులో చేరేందుకు సంబంధిత వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News February 15, 2025

బాదంపూడిలో కోళ్ల ఖననం

image

ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామంలోని బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో గ్రామస్థులు భయపడుతున్నారు. ప్రస్తుతం అక్కడ ఫ్లూ తో చనిపోయిన కోళ్లను పూడ్చే కార్యక్రమం చేస్తున్నాయి. శుక్రవారం కూడా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు కోళ్ల ఫార్మ్స్‌ని పరిశీలించాయి. గ్రామంలో 4 బర్డ్ ఫ్లూ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. వివిధ శాఖలకు చెందిన 200 మంది సిబ్బంది, అధికారులు విధులు నిర్వహిస్తున్నారని కార్యదర్శి గిరిధర్ తెలిపారు.

News February 15, 2025

తూ.గో: బర్డ్‌ ప్లూ లక్షణాలు ఎక్కడా లేవు: శాస్త్రవేత్తల బృందం

image

ఉమ్మడి జిల్లాలో పెరవలి మండలం మినహా ఎక్కడా బర్డ్‌ ప్లూ లక్షణాలు లేవని ..ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల స్పష్టం చేశారు. పారాల్లో పనిచేసే 28 మంది కార్మికుల నమూనాలు సేకరించి పరీక్షలు చేయగా నెగటివ్ రిపోర్టు వచ్చిందన్నారు. 25 మంది వైద్యుల సమక్షంలో ఉన్నారన్నారు. కానూరు అగ్రహారంలో మూడు నెలలు పాటు ఆంక్షలు కొనసాగుతాయని కోళ్ల పెంపకం చేయకూడదన్నారు.

News February 15, 2025

వరంగల్: ఎన్నికలకు రెడీ.. వాయిదాపై అధికారుల నిట్టూర్పు!

image

మూడు రోజుల ముందు వరకు వరంగల్ జిల్లాలోని అధికార యంత్రాంగం స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై తలమునకలయ్యారు. ఇంతలోనే BC సర్వే పూర్తయ్యాకే ఎన్నికల్లోకి వెళ్తామని మంత్రులు ప్రకటించడంతో అధికారులు నిరుత్సాహానికి గురయ్యారు. WGL జిల్లాలో 323 పంచాయతీలు, 130 MPTC, 11 ZPTC స్థానాలు ఉన్నాయి. వాటి ఎన్నికల కోసం ఇప్పటికే RO, AROలకు ట్రైనింగ్, సామగ్రి, పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితాపై ఏర్పాటు చేశారు.

error: Content is protected !!