News August 17, 2024

KMR: భారీ వర్ష భీభత్సం, జలమయమైన రోడ్లు

image

కామారెడ్డి పట్టణంలో శుక్రవారం సాయంత్రం సుమారు గంటన్నర పాటు కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. పట్టణంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా నిజాంసాగర్ చౌరస్తా నుంచి జీవదాన్ వెళ్లే దారిలో లయోల స్కూల్ చౌరస్తా వద్ద విద్యానగర్ కాలనీ నుంచి వచ్చిన డ్రైనేజీ నీటితో రోడ్డు మొత్తం నిండిపోయి చెరువును తలపించింది.

Similar News

News September 12, 2024

రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు పిట్లం విద్యార్ధిని ఎంపిక

image

రాష్ట్ర స్థాయి ఖో ఖో పోటీలకు పిట్లం ZPHS విద్యార్ధిని మహాలక్ష్మి ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ సంజీవులు తెలిపారు. పాల్వంచలో ఈ నెల 9 న జరిగిన జిల్లాస్థాయి ఖో ఖో టోర్నమెంట్లో మహాలక్ష్మి ప్రతిభ కనబరిచింది. ఖమ్మంలో జిల్లా కల్లూరు మిని స్టేడియంలో ఈనెల 13 నుంచి 15 వరకు జరిగే ఖో ఖో సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఆమె ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమెను ఉపాధ్యాయ సిబ్బంది, తదితరులు అభినందించారు.

News September 12, 2024

పొతంగల్: సీఎస్సీ నిర్వాహకురాలి ఇంటికి తాళం, వేలం

image

పొతంగల్ మండలం కల్లూరు గ్రామంలో కాజేసిన రూ.45 లక్షలు సకాలంలో చెల్లించక పోవడంతో కెనరా బ్యాంక్ కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వాహకురాలి ఇంటికి మహిళా సంఘాల సభ్యులు బుధవారం తాళం వేశారు. అనంతరం ఆ ఇంటిని వేలం వేయగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రూ.14.80 లక్షలకు దక్కించుకున్నాడు. సదరు మహిళ నెల రోజుల్లో కాజేసిన సొమ్ము చెల్లిస్తానని బాండ్ రాసిచ్చి రూ.6 లక్షల చెల్లించి కాలయాపన చేస్తున్నట్లు సభ్యులు తెలిపారు.

News September 11, 2024

KMR: తట్టుకోలేక.. తనువు చాలిస్తున్నారు

image

కుటుంబ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కెరీర్‌లో ఎత్తు పల్లాలు, లవ్ ఫెయిల్యూర్ ఇలా వివిధ కారణాలతో కొందరు తనువు చాలిస్తున్నారు. ఎంతో విలువైన జీవితానికి ముగింపు పలుకుతున్నారు. ఫలితంగా కుటుంబ సభ్యులకు వేదన మిగుల్చుతున్నారు. కామారెడ్డి జిల్లాలో బలవన్మరణానికి పాల్పడే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. జిల్లాలో ఈ ఏడాది 252 ఆత్మహత్యలు నమోదయ్యాయంటే.. ఆ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.