News July 24, 2024
KMR: భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల జైలు శిక్ష

భార్యను శారీరకంగా, మానసికంగా హింసించి ఆపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల సాధారణ జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ కామారెడ్డి అసిస్టెంట్ సెషన్స్ జడ్జి టి.నాగరాణి బుధవారం తీర్పు చెప్పారు. జిల్లాలోని లింగంపేట్ మండలం పోతాయిపల్లికి చెందిన గారబోయిన చిన్న సంగయ్య (43) తన భార్యపై హత్యాయత్నం చేసినట్లు నిరూపణ కావడంతో ఈ తీర్పును వెలువరించారు.
Similar News
News October 15, 2025
నిజామాబాద్: కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ

జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరణ సజావుగా కొనసాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
News October 15, 2025
నిజామాబాద్: బీసీ బంద్‌కు సీపీఎం మద్దతు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు ఆరోపించారు. బుధవారం బీసీ జేఏసీ నాయకులు కలిసి ఈ నెల 18న తలపెట్టిన బంద్‌కు మద్దతు కోరగా, సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన 42 శాతం రిజర్వేషన్ల తీర్మానానికి కేంద్రం తక్షణమే ఆమోదం తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. బంద్‌ను విజయవంతం చేయాలని రమేష్‌బాబు కోరారు.
News October 15, 2025
NZB: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి: బస్వా లక్ష్మీనర్సయ్య

వానాకాలం సీజన్ వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర సివిల్ సప్లై కమీషనర్‌ను బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో సుమారు 80 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ వరి ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు