News April 16, 2025

KMR: భూగర్భ జలాల సంరక్షణపై కలెక్టర్ మీటింగ్

image

జిల్లాలో భూగర్భ జలాల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో నీటి కొరత నివారణకు ఫామ్ పాండ్స్, బోరవెల్లి రీచార్జ్, ఇంకుడు గుంతలు, సోక్‌పిట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్షపు నీటిని భూమిలోకి చొప్పించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. అదనపు కలెక్టర్ చందర్ నాయక్, భూగర్భ జలాధికారి సతీష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 5, 2025

ఉమ్మడి కరీంనగర్.. నామినేషన్లకు నేడే LAST

image

ఉమ్మడి కరీంనగర్‌లో మూడో విడతలో 433 GPలకు, 3924 వార్డ్ మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటివరకు జగిత్యాలలో సర్పంచ్‌కి 352, వార్డు సభ్యులకు 1148, KNRలో సర్పంచ్‌కి 325, వార్డు సభ్యులకు 991, పెద్దపల్లిలో సర్పంచ్‌కి 242, వార్డు సభ్యులకు 927, సిరిసిల్ల జిల్లా సర్పంచులకు 317, వార్డు సభ్యులకు 896 చొప్పున నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. కాగా నామినేషన్లు ఇవాళ సా.5గం.ల వరకు స్వీకరిస్తారు.

News December 5, 2025

HYD: పునర్విభజనపై అభిప్రాయానికి సిద్ధమా?

image

గ్రేటర్‌లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు విలీనం చేయడంతో ఇపుడు అధికారులు వార్డుల పునర్విభజనపై దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి ప్రజాభిప్రాయాలను సేకరించనున్నారు. 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోనున్నారు. ఇందుకు వారం గడువు ఇవ్వనున్నారు. ఆ తర్వాత పది రోజుల్లోపు డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తిచేస్తారు. అప్పుడే అసలు ఎన్ని వార్డులు వచ్చే అవకాశముందనే విషయంపై క్లారిటీ వస్తుంది.

News December 5, 2025

Breaking: వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ

image

RBI గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు 5.50 నుంచి 5.25 శాతానికి చేరింది. ఈ క్రమంలో లోన్లు తీసుకునే వారికి ఊరట దక్కనుంది. ద్రవ్య విధాన కమిటీ 3 రోజుల సమావేశం తర్వాత ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. కాగా ఫిబ్రవరి, ఏప్రిల్‌లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున, జూన్‌లో 50 పాయింట్లను ఆర్బీఐ తగ్గించింది.