News April 16, 2025

KMR: భూగర్భ జలాల సంరక్షణపై కలెక్టర్ మీటింగ్

image

జిల్లాలో భూగర్భ జలాల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో నీటి కొరత నివారణకు ఫామ్ పాండ్స్, బోరవెల్లి రీచార్జ్, ఇంకుడు గుంతలు, సోక్‌పిట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్షపు నీటిని భూమిలోకి చొప్పించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. అదనపు కలెక్టర్ చందర్ నాయక్, భూగర్భ జలాధికారి సతీష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News April 17, 2025

ఏటూరునాగారం: వడదెబ్బతో కూలీ మృతి

image

వడదెబ్బతో కూలీ మృతి చెందిన ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగింది. కుటుంబీకులు తెలిపిన వివరాలు.. 1వ వార్డుకు చెందిన వ్యవసాయ కూలీ పలిశెట్టి వెంకటేశ్వర్లు(62) ప్రతి రోజు సమీపంలోని పంట పొలాలు, మిర్చి కల్లాల వద్దకు పనులకు వెళ్లేవారు. బుధవారం రాత్రి వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించే లోపే వెంకటేశ్వర్లు మృతి చెందారు.

News April 17, 2025

ఆలయాలలోని 1000కేజీల బంగారం కరిగింపు.. ఎక్కడంటే?

image

తమిళనాడులోని 21దేవాలయాలలో భక్తులు సమర్పించిన 1000 KGల బంగారు ఆభరణాలను కరిగించినట్లు అధికారులు తెలిపారు. వాటిని 24 క్యారెట్ల కడ్డీలుగా మార్చి SBIలో డిపాజిట్ చేసినట్లు వెల్లడించారు. వీటి ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.17.81కోట్ల వడ్డీ రానుండగా, ఆ నిధులతో ఆలయాలను అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే ఆలయాలలో నిరుపయోగంగా ఉన్న వెండిని సైతం కరిగించి డిపాజిట్ చేయనున్నట్లు పేర్కొన్నారు.

News April 17, 2025

నర్సంపేట: వ్యభిచార గృహంపై దాడులు

image

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. గురువారం పక్కా సమాచారం మేరకు ఒకరి ఇంట్లో దాడులు చేయగా.. పట్టణానికి చెందిన ఓ మహిళ, బాంజిపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మహిళలను వ్యభిచార కూపం నుంచి రక్షించినట్లు సీఐ రమణమూర్తి తెలిపారు.

error: Content is protected !!