News October 15, 2024

KMR: మంత్రాలు వేస్తున్నాడని కంట్లో కారం చల్లి కొట్టారు.. చివరికి కేసు

image

కామారెడ్డి జిల్లా అడ్లూర్ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి మంత్రాలు వేస్తున్నాడనే నెపంతో గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తిని గ్రామస్థులు చెట్టుకు కట్టేసి, కారంపొడి చల్లి కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో సాయిలు తలకు, కాళ్ల భాగాలలో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో వెంకోల్ల రాజు, వెంకోల్ల లక్ష్మణ్, స్వామి, గడ్డమీది లక్ష్మణ్‌పై కేసు నమోదుచేసినట్లు దేవునిపల్లి SI రాజు తెలిపారు.

Similar News

News October 25, 2025

నిజామాబాద్: మత్తు పదార్థాల నిరోధానికి కృషి చేయాలి: కలెక్టర్

image

మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయాల్సన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. నిజామాబాద్‌లో శనివారం కలెక్టర్ అధ్యక్షతన నషా ముక్త్ భారత్ అభియాన్ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు, కమిటీ ప్రతినిధులు జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగంపై వివరించారు.

News October 25, 2025

NZB: యుఎస్‌ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు ప్రారంభం

image

భారత ఐక్య విద్యార్థి సమాఖ్య (USFI) రాష్ట్ర మహాసభలు శనివారం NZBలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి ఖలీల్ వాడి, బస్టాండ్ మీదుగా మహాసభ ప్రాంగణం వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ రాష్ట్ర మహాసభలు శనివారం నుంచి సోమవారం వరకు 3 రోజుల పాటు జరగనున్నాయి. గత విద్యార్థి ఉద్యమాలపై సమీక్ష చేసి, భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు.

News October 25, 2025

కామారెడ్డి: కులం పేరుతో దాడి..13 మందికి జైలు శిక్ష

image

కులం పేరుతో దూషించి, దాడి చేసిన కేసులో 13 మంది నిందితులకు NZB కోర్టు శిక్ష విధించింది. సదాశివనగర్(M) అమర్లబండలో రాజేశ్వర్ తన ఇంట్లో భోజనం చేస్తుండగా రతన్ కుమార్‌తో పాటు మరో 12 మంది కులం పేరుతో దుషించి దాడి చేశారు. ఈ కేసును కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయగా కోర్టు A1 రతన్ కుమార్‌కు 3ఏళ్ల జైలు, రూ.7,200 జరిమానా మిగతా వారికి ఏడాది జైలు, రూ.4,200 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.