News March 23, 2024
KMR: మత్తు పదార్థాలు అమ్మిన ముఠా అరెస్ట్
మత్తుపదార్థాలు అమ్మిన ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎల్లారెడ్డి DSP శ్రీనివాసులు వెల్లడించారు. గురువారం పద్మాజీవాడి X రోడ్‌లో నిషేధిత అల్ఫాజోలం అమ్ముతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. నలుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.5 లక్షల విలువ చేసే అల్ఫాజోలం, 2 కార్లు, 2 బైక్‌లు, 5 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. కాగా రాజస్థాన్‌కు చెందిన మరో 2 పరారీలో ఉన్నారు.
Similar News
News September 14, 2024
రిజర్వాయర్ గేట్ల వద్ద చేపలు పడుతూ యువకుల కాలక్షేపం
ఎడపల్లి మండలంలోని అలీసాగర్ రిజర్వాయర్ గేట్ల వద్ద ఇటీవల భారీ వర్షాలతో అలీసాగర్ రిజర్వాయర్ గేట్లను ఎత్తారు. దీంతో వరదనీటితో పాటు చేపలు దిగువ ప్రాంతానికి వచ్చాయి. ఈ క్రమంలో నిజామాబాద్ పట్టణానికి చెందిన పలువురు యువకులు పెద్దఎత్తున అలీసాగర్ గేట్ల దిగువన నిలిచిన వరదనీటితో చేపలు పట్టేందుకు ఇలా చుట్టూ ఉన్న గోడపై కూర్చొని కాలక్షేపం చేశారు.
News September 13, 2024
పిట్లం: తల్లి దండ్రులు మందలించారని సూసైడ్
తల్లి దండ్రులు మందలించారని మనస్తాపంతో కొడుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పిట్లం మండలం తిమ్మానగర్‌లో శుక్రవారం జరిగింది. ఎస్సై రాజు వివరాలిలా.. తిమ్మనగర్ వాసి బొమ్మల నాందేవ్ (23) పనిచేయకుండా ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు. ఈ విషయంలో తల్లి దండ్రులు మందలించగా.. గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News September 13, 2024
NZB: అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు శనివారం సెలవు రద్దు: DEO
నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు శనివారం సెలవు రద్దు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. సాధారణంగా రెండో శనివారం సెలవు దినమని కానీ, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ నెల 2వ తేదీన సెలవు ఇచ్చిన నేపథ్యంలో 14వ తేదీన రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.