News February 4, 2025
KMR: ‘మత్స్యకారులందరరూ వివరాలను నమోదు చేసుకోవాలి’

కామారెడ్డి జిల్లాలోని ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న మత్స్యకారులందరూ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ్ యోజన కింద CSC సెంటర్ లలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీపతి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాతో పాటు వ్యక్తిగత సమాచారంతో తమ కామన్ సర్వీస్ కేంద్రాలను సంప్రదించాలన్నారు.
Similar News
News December 4, 2025
ఏలూరు జిల్లా BJP మోర్చా కమిటీల నియామకం

ఏలూరు జిల్లా BJP మోర్చా కమిటీ నియామకాలను జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి కిషోర్ గురువారం ప్రకటించారు. కీర్తి వెంకట రాంప్రసాద్ జిల్లా అధ్యక్షుడిగా, ఇలపకుర్తి కుసుమ కుమారి మహిళా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అగ్రహారపు వెంకటేశ్వరరావు ఓబీసీ మోర్చా, బుర్రి శేఖర్ ఎస్సీ మోర్చా, సయ్యద్ మీర్ జాఫర్ అలీ మైనారిటీ మోర్చా, అడబాక నాగ సురేష్ యువ మోర్చా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు.
News December 4, 2025
నవోదయ పరీక్షకు 28 కేంద్రాలు: పూర్ణిమ

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 13న జరిగే జవహర్ నవోదయ విద్యాలయ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రిన్సిపల్ పూర్ణిమ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షకు 5648 మంది విద్యార్థులు హాజరు అవుతారని వెల్లడించారు. www.navodaya.gov.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్ పొందాలని సూచించారు. వివరాలకు 9110782213 హెల్ప్ లైన్లో సంప్రదించాలన్నారు.
News December 4, 2025
శ్రీరాంపూర్: ఈ నెల 8న అప్రెంటిస్ట్ మేళా

ఈ నెల 8న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ శ్రీరాంపూర్ ప్రిన్సిపల్ సుజాత తెలిపారు. అప్రెంటిషిప్ మేళాలో మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఫ్రెండ్షిప్ మేళాలో పాల్గొనాలన్నారు. అర్హత గలవారు www.apprenticeshipindia.gov.inలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.


