News February 27, 2025
KMR: మధ్యాహ్నం 2 వరకు పోలింగ్ శాతం ఎంతంటే..?

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా టీచర్ల, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. జిల్లాలో 54 పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతున్న పోలింగ్ సరళిని జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. మరో వైపు వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం 2 వరకు జిల్లాలో పట్టభద్రులు 47.43%, 64.74% శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Similar News
News October 29, 2025
NLG: శిశువు విక్రయం కేసులో పురోగతి

నవ జాత శిశువు విక్రయం కేసులో నల్గొండ పోలీసులు పురోగతి సాధించారు. కడుపున పుట్టిన ఆడపిల్లను కన్నవారే విక్రయించిన ఘటనలో చిన్నారిని ఏలూరుకు చెందిన దంపతుల వద్ద పోలీసులు గుర్తించారు. శిశువు సహా ఆ దంపతులను నల్గొండకు తీసుకువచ్చి విచారిస్తున్నట్లు తెలిసింది. తిరుమలగిరి (సాగర్) మండలం ఎల్లాపురం తండాకు చెందిన కొర్ర బాబు, పార దంపతుల సంతానమైన ఆడ శిశువును రూ.3 లక్షలకు విక్రయించిన విషయం తెలిసిందే.
News October 29, 2025
త్వరలో మదనపల్లి జిల్లా సాకారం..?

ఉమ్మడి చిత్తూరు జిల్లా మూడు జిల్లాలుగా మారింది. నాడు అన్నమయ్య జిల్లాకు కలవడం కంటే మదనపల్లి జిల్లా కావాలని డిమాండ్ బలంగా వినిపించింది. దీనికి అనుకూలంగా మంత్రివర్గ ఉపసంఘం నివేదికపై సీఎం చర్చించారు. త్వరలో దీనిపై ఆమోదం తెలిపి మదనపల్లి జిల్లా కేంద్రం అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు పుంగనూరు లేదా పీలేరు రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. జిల్లా కేంద్రం మదనపల్లిపై మీ కామెంట్ చెప్పండి..!
News October 29, 2025
ఈ జిల్లాల్లో యథావిధిగా స్కూళ్లు

AP: మొంథా తుఫాను బలహీనపడింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నిన్నటి వరకు సెలవులు కొనసాగిన అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఇవాళ స్కూళ్లు యథావిధిగా నడవనున్నాయి. ఈమేరకు అధికారులు వెల్లడించారు. అటు తిరుపతి జిల్లాకు తొలుత ఇవాళ కూడా హాలిడే ప్రకటించినా.. తుఫాను ప్రభావం లేకపోవడంతో సెలవు రద్దు చేశారు. స్కూళ్లు కొనసాగుతాయని, విద్యార్థులు రావాలని సూచించారు.


