News February 26, 2025
KMR: మహా శివ రాత్రి.. శివాలయాలపై ప్రత్యేక కథనం..

శివరాత్రి నేపథ్యంలో KMR జిల్లాలోని ఆయా శివాలయాల పై ప్రత్యేక కథనం..దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఉన్న ఆది బసవేశ్వర స్వయంభు ఆలయం బొర్లంలో ఉంది. గుడిలోని ఆది బసవేశ్వరుడి నంది విగ్రహం ఏటేటా పెరుగుతూ ఉండడం విశేషం. 1500 ఏళ్ల క్రితం నిర్మించిన సోమలింగేశ్వర ఆలయం దుర్కిలో ఉంది. భక్తుల కోరికలు తీర్చే లింగేశ్వరుడిగా ఈ ఆలయం పేరు గాంచింది. మరి మీ గ్రామాల్లో ఉన్న ఆలయాల ప్రత్యేకత గురించి కామెంట్‌లో తెలుపండి.
Similar News
News March 17, 2025
డీలిమిటేషన్‌పై అఖిల పక్ష సమావేశం

TG: డీలిమిటేషన్ అంశంపై డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశం జరిగింది. బీఆర్ఎస్, బీజేపీ మినహా అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ అంశంపై ఇలాంటి సమావేశాలు ఇంకా కొనసాగుతాయని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తెలిపారు. డీలిమిటేషన్‌పై తమిళనాడులో జరిగే సమావేశానికి రాష్ట్ర ప్రతినిధుల బృందం వెళ్తుందని, ఒక్కో పార్టీ నుంచి ఒక్కొక్కరు హాజరవుతారని చెప్పారు.
News March 17, 2025
రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సోమవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు. ఎమ్మెల్సీగా విజయం సాధించిన తర్వాత తొలిసారిగా బొకే ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గవర్నర్‌కు విద్యారంగ, టీచర్ల సమస్యలు విన్నవించారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు పెంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
News March 17, 2025
CM చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ

AP: క్యాబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా MLC నాగబాబుకు మంత్రి పదవిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజధాని పున:ప్రారంభ పనులకు ప్రధాని మోదీని ఆహ్వానించే అంశంతో పాటు పలు కీలక అంశాలపై కూడా వీరు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.