News March 15, 2025
KMR: మహిళలకు అండగా ‘భరోసా’ కేంద్రం: SP

లైంగిక దాడికి గురైన బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కేసు ట్రయల్కు పరిహారం ఇప్పించేంతవరకు భరోసా సెంటర్ అండగా నిలుస్తుందని KMR జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. శనివారం ఆయన భరోసా సెంటర్ను సందర్శించారు. లైంగిక దాడులకు గురైన బాధితులకు సత్వర న్యాయానికి కృషి చేస్తున్నామన్నారు. బాధితులు భరోసా సెంటర్కి రాగానే.. తక్షణమే సూచనలు, సలహాలతో పాటు సహాయం అందించాలని సిబ్బందికి ఆదేశించారు.
Similar News
News November 22, 2025
సత్యసాయి బాబా శత జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించండి: కలెక్టర్

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతోత్సవాలను జిల్లా వ్యాప్తంగా వైభవంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేయాలని అధికారులను కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశించారు. ఈ ఏడాది సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా ప్రతీ మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కలెక్టర్ నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
News November 22, 2025
షూటింగ్లో గాయపడిన హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గాయపడ్డారు. Eetha మూవీలో ఓ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఆమె ఎడమకాలుకు దెబ్బ తగిలినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. దీంతో రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు పేర్కొంది. ఈ మూవీ లెజెండరీ లావణి నృత్యకారిణి విఠాబాయి బావు మంగ్ నారాయణ్ గావ్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. టైటిల్ రోల్లో శ్రద్ధా నటిస్తున్నారు.
News November 22, 2025
జగిత్యాల: నిరుద్యోగులకు రేపు జాబ్ మేళా

జగిత్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కోసం నవంబర్ 24న (ఆదివారం) ఉపాధి కల్పన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు బి. సత్యమ్మ తెలిపారు. కృషి విజ్ఞాన్ హైదరాబాద్లో 67, గూగుల్ పేలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ 30 పోస్టులు ఉన్నాయన్నారు. ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్నవారు హాజరు కావచ్చు. ఎంపికైన వారు జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, చొప్పదండి, ధర్మారం వంటి ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది.


