News March 15, 2025

KMR: మహిళలకు అండగా ‘భరోసా’ కేంద్రం: SP

image

లైంగిక దాడికి గురైన బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కేసు ట్రయల్‌కు పరిహారం ఇప్పించేంతవరకు భరోసా సెంటర్ అండగా నిలుస్తుందని KMR జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. శనివారం ఆయన భరోసా సెంటర్‌ను సందర్శించారు. లైంగిక దాడులకు గురైన బాధితులకు సత్వర న్యాయానికి కృషి చేస్తున్నామన్నారు. బాధితులు భరోసా సెంటర్‌కి రాగానే.. తక్షణమే సూచనలు, సలహాలతో పాటు సహాయం అందించాలని సిబ్బందికి ఆదేశించారు.

Similar News

News April 10, 2026

చేగోమ్మలో PACS గోదాం ప్రారంభించిన పొంగులేటి

image

కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని నూతనంగా నిర్మించిన PACS గోదాములను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, సంబంధిత అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

News April 10, 2026

ఖమ్మంలో రేపు ఫూలే జయంతి వేడుకలు: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కోరారు. శనివారం ఉదయం 9 గంటలకు శ్రీ శ్రీ సర్కిల్ వద్ద గల ఫూలే విగ్రహానికి నివాళులర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధికి ఫూలే చేసిన సేవలను స్మరించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.

News April 10, 2026

ఫ్లై 91 విమాన సేవలు ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్

image

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాదుకి కొత్తగా ఫ్లై 91 విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళంలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఈ సర్వీసును శుక్రవారం ప్రారంభించారు. ఈ కొత్త సర్వీసు వలన విజయవాడ, హైదరాబాదు నగరాల మధ్య ప్రయాణించే వారికి టైమింగ్స్ విషయంలో మరింత వెసులుబాటు కలుగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు.