News March 24, 2025
KMR: మానవ హక్కుల సహాయక సంఘం జిల్లా అధ్యక్షుడి నియామకం

కామారెడ్డి జిల్లా మానవ హక్కుల సహాయక సంఘం జిల్లా అధ్యక్షుడిగా మోసర్ల శ్రీకాంత్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర మానవ హక్కుల ఛైర్మన్, కామారెడ్డి ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి సలీం ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన మోసర్ల శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ప్రజల హక్కుల కోసం నిరంతరం పాటుపడతానని తెలిపారు.
Similar News
News December 1, 2025
NGKL: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మార్చాలా క్రీడాకారిణి

నాగర్‌కర్నూల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి ఎంపికల్లో జడ్పీహెచ్ఎస్ మార్చాలాకు చెందిన 10వ తరగతి క్రీడాకారిణి డి.మౌనిక ప్రతిభ చూపింది. ఈమె నల్గొండ జిల్లా హాలియాలో రేపటి నుంచి జరగబోయే 51వ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు ఎంపికైంది. నాగర్‌కర్నూల్ జట్టు తరఫున ఆమె ప్రాతినిధ్యం వహిస్తుందని హెచ్‌ఎం వెంకటరమణ తెలిపారు.
News December 1, 2025
MDK: గుర్తుల కేటాయింపులో అభ్యర్థులకు టెన్షన్!

సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికల అధికారులు ఆల్ఫాబెటికల్ ప్రకారం గుర్తులను కేటాయిస్తారు. ఓటర్లకు సులభంగా అవగాహన కలిగే గుర్తులు వస్తే ప్రచారం బాగుంటుంది. ఎక్కువగా వాడకంలో లేని గుర్తులు వస్తే ఓటర్లకు ఇబ్బంది కలుగుతుందని, ఎక్కువ మంది పోటీలో ఉంటే అనుకున్న గుర్తులు రావని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
News December 1, 2025
VKB: అభ్యర్థుల పేర్ల ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం గుర్తులు..!

సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికల అధికారులు అభ్యర్థుల పేర్ల ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం గుర్తులను కేటాయిస్తారు. ఓటర్లకు సులభంగా అవగాహన కలిగే గుర్తులు వస్తే బాగుంటుంది. ఎక్కువగా వాడకంలో లేని గుర్తులు వస్తే ఓటర్లకు ఇబ్బంది కలుగుతుంది. ఎక్కువ మంది పోటీలో ఉంటే అనుకున్న గుర్తులు రావని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.


