News February 9, 2025
KMR: మార్పు డెస్క్‌ను సందర్శించిన MCH అధికారి

కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శనివారం మార్పు డెస్క్ ద్వారా అందుతున్న సేవలను జిల్లా మాతా శిశు ఆరోగ్య ప్రోగ్రాం అధికారి డా.అనురాధ సందర్శించారు. గ్రామాల నుంచి జిల్లా ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు, బాలింతలకు అందుతున్న వైద్య సదుపాయాలపై ఆమె సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మార్పు డెస్క్ ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
Similar News
News March 17, 2026
NGKL: మనస్తాపంతో యువతి సూసైడ్

తెలకపల్లి మండలం గోళగుండం గ్రామానికి చెందిన భార్గవి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందింది. ఈ నెల 15న వివాహ సంబంధం నిమిత్తం మండల కేంద్రానికి వచ్చిన ఆమె అదే రోజు పురుగు మందు తాగింది. గమనించిన బంధువులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. లింగాల మండలం కోమటికుంటకు చెందిన కడెం బాలకృష్ణతో ఆమె సన్నిహితంగా ఉండేదని తండ్రి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI బి.నరేశ్ తెలిపారు.
News March 17, 2026
సంక్షేమ ఫలాలు అందక ప్రజల్లో అసంతృప్తి: కూనంనేని

ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, అవి క్షేత్రస్థాయిలో అర్హులకు అందకపోవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి నెలకొందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావన ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రజాస్వామ్య పాలనలో గవర్నర్ పాలన అవసరం లేదన్నారు.
News March 17, 2026
రేపటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన

AP: రాష్ట్రంలో 75 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్లలో పాలకవర్గం గడువు నేటితో ముగియనుంది. ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారులు రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికలు జరిగి కొత్త పాలక వర్గం ఏర్పడే వరకు వీరే పాలన చూసుకుంటారు. ఇక ఏలూరు కార్పొరేషన్‌కు జులై 29, మరో 13 పురపాలికల్లో నవంబర్ 21తో గడువు ముగియనుంది. అటు పంచాయతీల్లో APR 2 నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనుంది.


