News March 1, 2025

KMR మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి: SP

image

మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని KMR జిల్లా SP సింధు శర్మ పిలుపునిచ్చారు. ఇద్దరు మావోయిస్టు సభ్యులు ఇవాళ SP ముందు లొంగిపోయిన విషయం తెలిసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జన జీవన స్రవంతిలో కలిసి ఉండాలనుకునేవారికి ప్రభుత్వం తరపున వచ్చే లభాలన్ని అందేలా చూస్తామన్నారు. అజ్ఞాతంలో ఉండి సాధించేదేమీ లేదని, లొంగితే పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించేందుకు కృషి చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.

Similar News

News October 28, 2025

ఈ 12 జిల్లాల్లో నేటి నుంచే రేషన్ పంపిణీ

image

AP: తుఫాను ప్రభావిత జిల్లాల్లో ఇవాళ్టి నుంచే రేషన్ పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, ప.గో, కృష్ణా, బాపట్ల, కాకినాడ, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లోని రేషన్ లబ్ధిదారులకు సరుకులు అందజేయనున్నారు. అటు ఈ 12 జిల్లాల్లో రాబోయే 3 రోజులపాటు పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా కంపెనీలతో మాట్లాడి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.

News October 28, 2025

కోనసీమ: లైసెన్స్ స్లాట్లను మార్చుకోండి..!

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈనెల 28, 29, 30, 31వ తేదీల్లో లెర్నింగ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం స్లాట్ బుక్‌ చేసుకున్న అభ్యర్థులు వచ్చే వారానికి మార్చుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు సూచించారు. ఆయన మాట్లాడుతూ.. తుఫాన్ కారణంగా వాహనదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సిటిజెన్‌ లెవెల్‌లో స్లాట్స్‌ మార్చుకునే సదుపాయం తెచ్చామని చెప్పారు.

News October 28, 2025

‘జీర్ణం వాతాపి జీర్ణం’ అని ఎందుకంటారు?

image

ఇల్వలుడు, వాతాపి అనే రాక్షస సోదరులు ప్రయాణికులను మోసం చేస్తూ ఉండేవారు. వాతాపి మేకగా మారి, వంటగా వడ్డింపబడి, భోజనం తర్వాత కడుపు చింపుకొని బయటకు వచ్చేవాడు. ఇలా అగస్త్యుడు ఓనాడు వాతాపిని తిన్నాడు. ఇల్వలుడు వాతాపిని పిలవగా అగస్త్యుడు వాతాపి ఎప్పుడో జీర్ణమయ్యాడంటూ కడుపును రుద్దుతూ ‘జీర్ణం వాతాపి జీర్ణం’ అన్నాడు. దీని ఆధారంగా తిన్నది బాగా జీర్ణం కావాలని ఇలా చెప్పడం అలవాటుగా మారింది. <<-se>>#DHARMASANDEHALU<<>>