News February 19, 2025

KMR: ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి: శరత్

image

రానున్న వేసవిలో కామారెడ్డి జిల్లాలో త్రాగునీటి సమస్య లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఉమ్మడి NZB జిల్లా ప్రత్యేక అధికారి శరత్ అన్నారు. మంగళవారం జిల్లాకు చేరుకున్న ఆయన KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తో కలిసి త్రాగునీటి పై చర్చించారు. వేసవిలో నీటి ఇబ్బందులు రాకుండా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలన్నారు. అవసరమైతే..అద్దె బోర్ల నుంచి నీటిని సరఫరా చేయాలని సూచించారు.

Similar News

News October 16, 2025

ప్రకాశం వంటకాలలో స్పెషల్ ఇదే!

image

నేడు ప్రపంచ భోజన దినోత్సవం. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా వంటకాల స్పెషాలిటీ చూస్తే నోరు ఊరాల్సిందే. జిల్లాలో ప్రధానంగా ఊరగాయ పచ్చళ్లు వెరీ ఫేమస్ అని చెప్పవచ్చు. అంతేకాదు ఒంగోలు నగరానికి ఎవరైనా వచ్చారంటే చాలు.. ఇక్కడి వంటకమైన మైసూర్ పాక్‌ను రుచి చూడాల్సిందే. ఒంగోలు నగరం నుంచి విదేశాలకు కూడా మైసూర్ పాక్ తరలి వెళుతుందంటే.. ఆశ్చర్యం కలిగించక మానదు. మరి మీరు మైసూర్ పాక్ టేస్ట్ అనే చేశారా!

News October 16, 2025

NLG: రేపే జాబ్ మేళా

image

రేపు ఉదయం 10.30 గంటలకు నల్గొండలోని ఐటీఐ క్యాంపస్‌లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ తెలిపారు. జిల్లాలో పదో తరగతి నుంచి డిగ్రీ, ఐటీఐ (అన్ని ట్రేడ్ల)లో ఉత్తీర్ణత పొందిన 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గలవారు అర్హులని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News October 16, 2025

దహేగాం: పాము కాటుతో గర్భిణీ మృతి

image

దహేగాం మండల కేంద్రానికి చెందిన స్రవంతి(22) అనే గర్భిణీ పాము కాటుకు గురై మృతి చెందింది. కుటుంబీకుల వివరాలు.. బుధవారం భర్త శ్యామ్‌తో స్రవంతి పత్తి చేనుకు వెళ్లింది. ఈక్రమంలో నీళ్లు తాగడానికి మోటార్ వైపు వెళ్తుండగా పాము కాటేసింది. గమనించిన భర్త వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్రథమిక చికిత్స చేసి బెల్లంపల్లికి రిఫర్ చేశారు. అక్కడి వైద్యులు పరిక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.