News March 19, 2025
KMR: ముగిసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ముగిశాయి. మార్చ్5 న ప్రారంభమైన ఈ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఇంటర్ మొదటి సంవత్సరం రసాయన శాస్త్రం, కామర్స్ పరీక్ష జరిగింది. జనరల్ గ్రూప్‌నకు సంబంధించి 7948 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 7719 మంది పరీక్షకు హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1865 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 170 మంది పరీక్షకు దూరంగా ఉన్నారని కామారెడ్డి జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు.
Similar News
News March 20, 2025
బండి సంజయ్‌పై కేసు కొట్టివేత

TG: కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై 2020లో GHMC ఎన్నికల ప్రచారం వేళ నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. అప్పుడు కార్యకర్తల భేటీలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆయనపై సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇవాళ ఆ కేసుపై విచారణ జరగ్గా ఆధారాలు లేవని బండి సంజయ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కేసు కొట్టేస్తూ తీర్పునిచ్చింది.
News March 20, 2025
‘ఆర్యవైశ్యులు సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’

ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలను ఆర్యవైశ్యులు సద్వినియోగం చేసుకోవలని ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ నంద్యాల నాగేంద్ర అన్నారు. గురువారం ఆయన నగరంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి గాను సబ్సిడీతో కూడిన రుణాలను వివిధ వ్యాపారాల ఏర్పాటు చేసుకుని లబ్ధి పొందేందుకు 22వ తేదీ లోపు దరఖాస్తులను ఆన్లైన్ చేసుకోవాలని కోరారు.
News March 20, 2025
హన్మపూర్ హత్య కేసులో ఇద్దరికి రిమాండ్

పెద్దేముల్ మండల పరిధిలోని హన్మాపూర్‌లో వెంకటేశ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఎస్ఐ శ్రీధర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం.. వెంకటేష్ నిత్యం తాగి వచ్చి తల్లి లక్ష్మమ్మ, భార్య సబితను వేధించేవాడు. వేధింపులకు తాళలేక ఈనెల 19న తల్లి, భార్య ఇద్దరు కలిసి ఐరన్ రాడ్‌తో అతడి చెవి భాగాన కొట్టి చంపారు. నేరం ఒప్పుకోవడంతో వారిని రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు.