News February 12, 2026
KMR: మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారుల నియామకం!

కామారెడ్డి జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారులు నియామకమయ్యారు. మున్సిపాలిటీల్లో ఈ నెల 16న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులను నియమించారు. కామారెడ్డి-మధు మోహన్(అదనపు కలెక్టర్), బాన్సువాడ-కిరణ్మయి(సబ్ కలెక్టర్), బిచ్కుంద-చందర్ నాయక్(జడ్పీ CEO), ఎల్లారెడ్డి-పార్థసింహ రెడ్డి(RDO-ఎల్లారెడ్డి)ని నియమించారు.
Similar News
News March 13, 2026
FLASH: మళ్లీ తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ఇవాళ <<19369095>>మరోసారి<<>> తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,530 తగ్గి రూ.1,60,690కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,400 పతనమై రూ.1,47,300 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.2,90,000గా ఉంది.
News March 13, 2026
గుంటూరు: రేపు జాతీయ లోక్ అదాలత్

జాతీయ లోక్ అదాలత్‌ను ఈ నెల 14న నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. 14న ఉదయం 10 గంటల నుంచి జిల్లా న్యాయస్థానం ఆవరణలో లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో సివిల్, కాంపౌండబుల్, క్రిమినల్ కేసులు, కుటుంబ, వివాహ సమస్యలు పరిష్కరించుకోవచ్చని చెప్పారు.
News March 13, 2026
గ్యాస్ సరఫరాపై అపోహలు వద్దు: కలెక్టర్

గ్యాస్ సిలిండర్లపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నమ్మవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రులు, విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ సంస్థలకు, ఆశ్రమాలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.


