News February 4, 2025
KMR: మెరిట్ లిస్ట్ విడుదల: DMHO

వ్యాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్ రిక్రూట్మెంట్‌కి సంబంధించి ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖధికారి కార్యాలయంలో డిస్ప్లే చేయడం జరిగిందని DMHO చంద్రశేఖర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో పాటు Kamareddy.telangana.gov.in వెబ్సైట్లో తమ వివరాలు చూసుకోవచ్చని పేర్కొన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు.
Similar News
News February 18, 2025
ఈ ప్రాంతాల్లో భారీగా పడిపోయిన భూగర్భ జలాలు

గ్రేటర్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోయాయని తెలిపిన భూగర్భజల శాఖ అధికారులు లిస్ట్ విడుదల చేశారు. ఎర్రగడ్డ, చంద్రాయణగుట్ట, మేడిపల్లి, హస్మత్‌పేట, యాప్రాల్, ఫతేనగర్, దూలపల్లి, శంభిపూర్, చెంగిచెర్ల, గుండ్ల పోచంపల్లి, మేడిపల్లి, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, ఉప్పల్, పటాన్‌చెరు, రామంతపూర్, రామచంద్రపురం ప్రాంతంలోనూ 10 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి.
News February 18, 2025
కుంభమేళా పొడిగింపు..? యూపీ సర్కారు జవాబు ఇదే

భక్తుల రద్దీని, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మహా కుంభమేళాను మరో రెండు రోజుల పాటు పొడిగిస్తారంటూ వస్తున్న వార్తలపై యూపీ సర్కారు స్పందించింది. అలాంటి ఆలోచనలేవీ లేవని తేల్చిచెప్పింది. ముందుగా చెప్పినట్లుగానే ఈ నెల 26న మహాశివరాత్రి రోజునే కుంభమేళా ముగుస్తుందని వివరించింది. తాము అధికారికంగా చెబితే తప్ప.. సోషల్ మీడియాలో వచ్చే వదంతుల్ని నమ్మొద్దని సూచించింది.
News February 18, 2025
బిచ్కుంద : పిగ్ మీ పేరిట ఘరానా మోసం

బిచ్కుంద మండల కేంద్రంలోని కెనరా బ్యాంకులో తాత్కాలికంగా దరఖాస్తులు రాసుకుంటూ ఉపాధి పొందుతున్న జంగం రాజు అనే వ్యక్తి ఖాతాదారులను పిగ్ మీ పేరిట భారీగా డిపాజిట్ల సేకరించారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఖాతాదారులు బ్యాంకు అధికారులను నిలదీయగా తమకు సంబంధం లేదని తేల్చేశారు. మోసం చేసిన వ్యక్తి కుటుంబంతో సహా పరారైయ్యాడు. రూ.60 లక్షలు స్వాహా చేశాడని బాదితులు ఆరోపిస్తున్నారు.