News April 4, 2025
KMR: మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులపై కేసు: SP

మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరంమని.. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇస్తే వారిపై కేసు నమోదు చేస్తామని కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర హెచ్చరించారు. కలెక్టరేట్లో రోడ్ సేఫ్టీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం జరిగింది. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో 28 బ్లాక్ స్పాట్లను ఇప్పటి వరకు గుర్తించినట్లు తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్‌ను తప్పకుండా పాటించాలని సూచించారు.
Similar News
News September 19, 2025
HYD: నేడు HCUలో విద్యార్థి సంఘం ఎన్నికలు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుతుంది. నేడు ఉ.9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్యాంపస్‌లో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ అనంతరం సాయంత్రం బ్యాలెట్ బాక్స్‌లను ఓట్ల లెక్కింపు కేంద్రానికి తరలిస్తారు. అనంతరం ఓట్ల లెక్కింపును ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు.
News September 19, 2025
ఎల్లంపల్లి ప్రాజెక్ట్.. 38 గేట్లు ఎత్తివేత

గురువారం కురిసిన వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టులోని 62 గేట్లలో 38 గేట్ల ద్వారా గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో మత్సకారులు, తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
News September 19, 2025
సిరిసిల్ల: పేకాటస్థావరంపై దాడులు.. ఒకరు మృతి

ఎల్లారెడ్డిపేట మం. వెంకటపూర్‌లో గురువారం రాత్రి పోలీసులు <<17757085>>పేకాటస్థావరంపై దాడులు<<>> చేశారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన చాకలి రాజయ్య(55) భయంతో పరుగులు తీశాడు. చీకటి పడ్డా అతడు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు గాలించారు. ఈ క్రమంలో వాగు సమీపంలో రాజయ్య పడున్నాడు. కుటుంబ సభ్యులు చూసేసరికి అప్పటికే మృతిచెందాడు. పరుగులు తీయడంతోనే రాజయ్య కుప్పకూలాడని, ఈ క్రమంలో గుండెపోటు వచ్చి చనిపోయినట్లు అనుమానిస్తున్నారు.