News January 19, 2025
KMR: మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న మైనార్టీ అభ్యర్థులకు బేసిక్ ఫౌండేషన్ కోర్సులో 4 నెలలు ఉచిత శిక్షణ అందించనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి దయానంద్ శనివారం తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తుతో పాటు సంబంధిత పత్రాలను వచ్చే నెల 15వ తేదీ లోపు కామారెడ్డి జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News October 15, 2025
ప్రముఖ నటుడు కన్నుమూత

వెటరన్ బాలీవుడ్ యాక్టర్ పంకజ్ ధీర్(68) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచినట్లు సినీ& TV ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపింది. 1988-94 మధ్య BR చోప్రా తెరకెక్కించిన ‘మహాభారత్’ టీవీ సీరియల్లో కర్ణుడి పాత్రతో పంకజ్ గుర్తింపు పొందారు. పలు బాలీవుడ్ సినిమాలు, టీవీ సీరియళ్లలో ఆయన నటించారు.
News October 15, 2025
HYD: ‘సర్కారు చేతికి మెట్రో’.. రేపు కీలక నిర్ణయం

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని సీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఈ నెల16న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే సీఎం, సీఎస్ రామక్రిష్ణారావు, మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ తదితరులతో సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ ముగించాలని సీఎం భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తీసుకోనున్నారు.
News October 15, 2025
బిహార్లో 57 మందితో JDU తొలిజాబితా

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు పాలక జనతాదళ్(U) 57 మందితో తొలిజాబితా విడుదల చేసింది. నిన్న NDA కూటమిలోని బీజేపీ 71 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం తెలిసిందే. 2 విడతల్లో జరిగే ఎన్నికల్లో BJP, JDU చెరో 101 సీట్లలో, LJP (R)29, RLM, HAM 6 చొప్పున సీట్లలో పోటీచేయాలని నిర్ణయించాయి. అయితే తమకు సంబంధించిన కొన్ని స్థానాలను LJPకి కేటాయించడంపై JDU అభ్యంతరం చెబుతోంది. ఆ స్థానాల్లో తమ వారికి టిక్కెట్లు ఇచ్చింది.