News January 24, 2025
KMR: మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న మైనార్టీ అభ్యర్థులకు బేసిక్ ఫౌండేషన్ కోర్సులో 4 నెలలు ఉచిత శిక్షణ అందించనున్నట్లు జిల్లా అల్ఫ సంఖ్యాక వర్గాల అభివృద్ధి అధికారి దయానంద్ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తుతో పాటు సంబంధిత పత్రాలను వచ్చే నెల 15వ తేదీ లోపు కామారెడ్డి జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News December 22, 2025
FLASH.. నకిరేకల్‌లో మర్డర్

నకిరేకల్‌లో తెల్లవారుజామున దారుణ హత్య జరిగింది. తిప్పర్తి రోడ్డులో నివాసముండే ఎలగందుల వెంకన్న అనే కోడిగుడ్ల వ్యాపారిని గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా హతమార్చారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
News December 22, 2025
బిగ్ బాస్ విన్నర్ మన ఉత్తరాంధ్ర కుర్రాడే..!

ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్‌లో కళ్యాణ్ పడాల విన్నర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇతనిది భోగాపురం మండలం సుందరపేట. భారత ఆర్మీలో పని చేసిన కళ్యాణ్, బిగ్ బాస్ షోలో కామనర్ కేటగిరీలో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల ఆదరణ పొంది విజేతగా నిలిచారు. కాగా కళ్యాణ్ తల్లిదండ్రులు పాన్‌షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. సాధారణ కుటుంబానికి చెందిన కళ్యాణ్ విజేతగా నిలవడంతో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
News December 22, 2025
సిద్దిపేట: చలి బాబోయ్ చలి.. మంట కాచుకున్న కుక్కలు

చలి బాబోయ్ చలి అంటూ కుక్కలు చలి మంట కాచుకున్నాయి. సిద్దిపేట జిల్లాలో మూడు రోజుల నుంచి చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. సిద్దిపేట జిల్లా ఎన్సాన్పల్లిలో చలి నుంచి ఉప శమనం కోసం కొంతమంది యువకులు చలిమంటలు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే చలికి వణుకుతున్న కుక్కలు మంటల దగ్గరకు వచ్చి కాచుకున్నాయి. దీంతో మూగజీవాలు చలికి ఇబ్బందులు పడుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.


